తెలంగాణలో కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.2.50 లక్షలు
కుల విభేదాలను నిర్ములించేందుకు కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఒక పని చేసింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. అంతకు ముందు ఉన్న చట్టాన్ని తాజాగా కేంద్రం సవరణ చేసింది ఈమేరకు 2013 నాటి పధకానికి కులాంతర వివాహం ద్వారా సామజిక సమగ్రతకు డాక్టర్. అంబేద్కర్ పధకం కేంద్రం సవరణ చేసింది.

ప్రభుత్వం
ఎస్సీల్లో కులాంతరం వివాహాలను మరింత ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రోత్సాహకంగా అందించే ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచాలని యోచినట్లు సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న రూ.50 వేల సాయాన్ని రూ.2.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

కులాంతర వివాహాలు
ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఓ ప్రముఖ మీడియాలో ప్రచురితమైంది. ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ చేసే అవకాశముంది. రాష్ట్రంలో ఎస్సీల కులాంతర వివాహాలు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సామాజికవర్గానికి ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

కల్యాణ్ లక్ష్మీ పథకం
వాస్తవానికి ఎస్పీవర్గానికి చెందిన దళిత యువతుల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ్ లక్ష్మీ పథకం ద్వారం లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తోంది. కులాంతరం వివాహం చేసుకుంటే ప్రోత్సహకంగా మరో 50 వేలు అదనంగా ఇస్తున్నారు. ఈ లెక్కన కులాంతర వివాహం చేసుకున్న దళిత జంటకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్షా 50 వేలు అందుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని
అయితే కులాంతర వివాహం కారణంగా తల్లిదండ్రులతో సత్సంబంధాలు లేక యువతులు కల్యాణ లక్ష్మి కింద లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కులంతరం వివాహాలను ప్రోత్సహించే చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లయితే కులాంతర వివాహాలు చేసుకోవాలనుకునే దళిత యువతి,యువకులకు వరంగా మారనుంది.


Click it and Unblock the Notifications