ఎక్కడైనా ఒక చోట దొంగతనం జరిగితే ముందుగా అక్కడ ఉండే వారిపైనే ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తుంటారు పోలీసులు. ఇంటి దొంగలే అసలు నిందితులు అని తేలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన ఓ ఏటీఎం చోరీ ఘటనలోనూ సేమ్ టు సేమ్ ఇలాగే జరిగింది. బ్యాంక్ మేనేజర్ స్వయంగా ఓ వ్యక్తితో ఏటీఎం నుంచి 18.37 లక్షల రూపాయలు దొంగలించేలా ప్లాన్ చేశాడని పోలీసులు కనిపెట్టారు. దొంగతనం చేసిన వ్యక్తికి బ్యాంక్ మేనేజర్‌కు పరిచయం ఎలా అయ్యిందో తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు.

అసలు స్టోరీలోకి
అసలు స్టోరీలోకి వెళితే చేతన్ కుమార్ అనే వ్యక్తి బంటి కెరియా ప్రాంతంలోని ఏటీఎం నుంచి 18.37 లక్షలు దొంగిలించాడు. ఏటీఎం మిషన్ రిపేర్ కోసం అంటూ వచ్చి టెక్నికల్‌గా మిషన్‌ను తెరిచి లక్షల రూపాయల సొమ్ముతో ఉడాయించాడు. కొన్ని నెలల తరువాత చేతన్ కుమార్‌ను పట్టుకుని విచారించిన పోలీసులు బ్యాంక్ మేనేజర్ రాబిన్ బన్సల్ ఇచ్చిన సలహా కారణంగానే అతడు ఈ దొంగతనం చేశాడని తెలుసుకుని విస్తుపోయారు.

రూ. 50 వేల
తాను లక్ష రూపాయల లోన్ కోసం రాబిన్ బన్సల్‌ను కలిశానని ఆ సమయంలోనే అతడు ఈ దొంగతనం చేయాలని తనకు సలహా ఇచ్చాడని పోలీసులకు వివరించాడు. తాను చెప్పినట్టు చేస్తే రూ. 50 వేల ఇస్తానని రాబిన్ చెప్పినట్టు నిందితుడు చేతన్ పోలీసులకు వివరించాడు.

సినిమాల్లో
చేతన్ చెప్పిన వివరాలతో రాబిన్‌ను అరెస్ట్ చేయాలని భావించిన పోలీసుల ప్రయత్నాలు ఇంకా నెరవేరలేదు. చేతన్ పోలీసులకు చిక్కాడని తెలుసుకున్న రాబిన్ బన్సల్ వారికి దొరక్కుండా పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. మొత్తానికి సినిమాల్లో చూపించిన విధంగా ప్లాన్ చేసిన బ్యాంక్ మేనేజర్ రాబిన్ నిర్వాకం చూసి పోలీసులే ముక్కన వేలేసుకున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications