త్వరలో SBI ఏటిఎంలు రూపురేఖలు మారబోతున్నాయి అంటా! ఎందుకో తెలుసా?

వచ్చే రెండేళ్లలో దేశంలోని ఎస్‌బీఐ ఏటీఎంల రూపురేఖలు మారిపోనున్నాయి. సోలార్ పవర్‌తో పనిచేసే 10,000 ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు ఎస్‌బీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. 2030 నాటికి కార్బన్ రహితంగా మారే దిశలో ఈ అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం బ్యాంకు 150 భవనాలపై సోలార్ ప్యానెల్స్‌ని ఉపయోగిస్తోంది ఎస్‌బీఐ. భవిష్యత్తులో పునరుత్పాదక శక్తిని ఎక్కువగా వాడుకోవాలని భావిస్తోంది. ఏడాదిలో 250 భవనాలు సోలార్ ఎనర్జీని ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో 6.23 మెగావాట్ల సామర్థ్యం గల 151 సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది.

త్వరలో SBI ఏటిఎంలు రూపురేఖలు మారబోతున్నాయి అంటా! ఎందుకో తెలుసా?

ఇక ఎస్‌బీఐ రెండో గ్రీన్ మారథాన్‌ను ప్రకటించింది. ఈ మారథాన్ భారతదేశంలోని 15 నగరాల్లో జరగనుంది. 75,000 మంది పాల్గొంటారని అంచనా.

ప్రస్తుతం 1,200 ఏటీఎంలు సోలార్ పవర్‌తో పనిచేస్తున్నాయి. ఆ సంఖ్యను రెండేళ్లలో 10,000 ఏటీఎంలకు చేర్చాలన్నది మా లక్ష్యం. అంతేకాదు మేం ఎలక్ట్రిక్ వెహికిల్స్‌నే ఉపయోగించబోతున్నాం. 2030 నాటికి మా బ్యాంకులు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగిస్తాయి అని ప్రశాంత్ కుమార్, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+