For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డు మార్కును దాటిన పెట్రోల్ ధరలు.లీటర్ రూ.100 చేరడం ఖాయమా.

ఇంధన ధరలు శనివారం మెట్రో నగరాల్లో తాజాగా పెరిగాయి కానీ డీజిల్ రేట్లు వరుసగా నాలుగవ రోజు మారలేదు. దేశ రాజధానిలో పెట్రోలు లీటరుకు రూ.82.44 రూపాయల వద్ద విక్రయించగా

By bharath
|

ఇంధన ధరలు శనివారం మెట్రో నగరాల్లో తాజాగా పెరిగాయి కానీ డీజిల్ రేట్లు వరుసగా నాలుగవ రోజు మారలేదు. దేశ రాజధానిలో పెట్రోలు లీటరుకు రూ.82.44 రూపాయల వద్ద విక్రయించగా, శుక్రవారం నాడు లీటరుకు రూ.82.32 రూపాయల వద్ద విక్రయాలు జరిగాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ వెల్లడించింది.

ఇంధన వ్యయం కారణంగా

ఇంధన వ్యయం కారణంగా

ఇంతలో, ముంబైలో అత్యధిక ఇంధన వ్యయం కారణంగా ధరలు పెరిగాయి, తాజాగా పెరిగిన ధరలతో పెట్రోల్ లీటర్ కు రూ.90 రూపాయల మార్కును చేరుకోగా విక్రయం మాత్రం రూ.89.80 రూపాయల వద్ద జరుగుతోంది.

డీజిల్ ధరలు

డీజిల్ ధరలు

అయితే, ఇతర కీలక రవాణా ఇంధనం డీజిల్ పై శనివారం ధరలు మారలేదు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో డీజిల్ ధరలు రూ.73.87 రూపాయలు, రూ .75.72, రూ. 78.42, రూ .78.10 చొప్పున లీటరుకు చేరాయి.

గత కొన్ని వారాల నుంచి

గత కొన్ని వారాల నుంచి

గత కొన్ని వారాల నుంచి ఇంధన ధర బాగా పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు కు నిరసనగా యూనియన్ పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంతర్జాతీయ కారణాలను నిందించారు.

ఎక్సైజ్ సుంకం

ఎక్సైజ్ సుంకం

ఈ వారంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్పై ప్రతి లీటరుకు రూ.1 రూపాయి ఎక్సైజ్ని తగ్గించింది. కర్ణాటక ప్రభుత్వం సోమవారం నాడు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ తగ్గిస్తూ ప్రకటించింది.మంజూరైన ఈ ఇంధనాలపై సెస్ తగ్గడంతో మంగళవారం నుంచి ప్రతి లీటర్కు రూ.2 రూపాయల చొప్పున తగ్గనుంది.

Read more about: petrol diesel
English summary

రికార్డు మార్కును దాటిన పెట్రోల్ ధరలు.లీటర్ రూ.100 చేరడం ఖాయమా. | Petrol Nears Rs 90 Mark in Mumbai, Diesel Remains Unchanged

Fuel prices climbed to fresh highs across the metros cities on Saturday while diesel rates were unchanged for the fourth consecutive day.
Story first published: Saturday, September 22, 2018, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X