ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న మరో అగ్ర కంపెనీ!
అంతర్జాతీయ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొనేందుకు చైనా వెళ్లిన మంత్రి లోకేష్ టీసీఎల్ కంపెనీ సీఎఫ్‌వో మైకేల్ వాంగ్ తో భేటీ అయ్యారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన టిసిఎల్ దేశంలో మొదటిసారి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దింతో ఆంధ్రప్రదేశ్ కి శుభవార్త అని చెప్పచు.

నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ సమక్షంలో టిసిఎల్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మధ్య ఒప్పందం జరిగింది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మేషిన్లు, ఏసీలు, ఫ్రిజ్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో టిసిఎల్ పేరు ప్రఖ్యాతలు పొందింది.

ఏపీలో
ఇండియాలో ఏడాదికి 500 బిలియన్ డాలర్ల విలువైన కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ వినియోగిస్తున్నారు. అందులో 50 శాతం కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారు చెయ్యాలన్నది ప్రభుత్వ లక్ష్యం. షేన్ జెన్ ను సందర్శించాక ఏపీలో ఒక మినీ షేన్ జెన్ ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఏర్పడింది.

టిసిఎల్
టిసిఎల్ సంస్థ సీఎఫ్ఓ మైకెల్ వాంగ్ తో సమావేశం ఒక అద్భుత అవకాశం. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగం వేళ్ళూనుకోడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించి మైకెల్ వాంగ్ ఇచ్చిన సహకారం నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది. నా చైనా పర్యటనలో అత్యంత సఫలమైన సందర్భం ఇది.

పెద్ద కన్జ్యుమర్
ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ టిసిఎల్, దేశంలో మొదటిసారిగా ఏపీలో అడుగు పెడుతోంది . నా చైనా పర్యటనలో అత్యంత సఫలమైన సందర్భం ఇది. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ టిసిఎల్, దేశంలో మొదటిసారిగా ఏపీలో అడుగు పెడుతోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ రంగానికి, రాష్ట్ర యువతకు ఇది నిజంగా శుభవార్త అని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.


Click it and Unblock the Notifications