SBI కస్టమర్లకి హెచ్చరిక మిస్ కాకుండా చదవండి.
ఇది డిజిటల్ యుగం. ఎలాంటి లావాదేవీలైనా స్మార్ట్‌ఫోన్‌పై జరిగిపోతుంటాయి. కాలు కదపకుండా కూర్చున్నచోటి నుంచే ట్రాన్సాక్షన్స్ చేయడం మంచి సదుపాయమే. కానీ ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో అక్కడ ప్రమాదం కూడా పొంచే ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మీరు కాలు కదపకుండా ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తారో సైబర్ నేరగాళ్లు కూడా కూర్చున్న చోటి నుంచే మీ అకౌంట్ ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి మోసాల పట్ల అవగాహన కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
సోషల్ మీడియాలో
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు మెయింటైన్ చేసేవారితో పరిచయం పెంచుకుంటూ మీ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకండి అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. వెరిఫైడ్ అకౌంట్లు, అఫిషియల్ హ్యాండిల్స్‌నే ఫాలోకావాలని సూచిస్తోంది. ఎస్‌బీఐ ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ట్వీట్ చేసింది.

బ్లూ రైట్ టిక్
మీ ఆర్థిక వివరాలన్నీ రహస్యంగా ఉంచాలని, సోషల్ మీడియాలో ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేయకూడదని సూచిస్తోంది ఎస్‌బీఐ. సోషల్ మీడియా సైట్లల్లో ఫేక్ అకౌంట్స్‌ని అస్సలు పట్టించుకోకూడదని చెబుతోంది. వెరిఫైడ్ అకౌంట్లను 'బ్లూ రైట్ టిక్' చూసి గుర్తించొచ్చు. అవి తప్ప మిగతా ఏ అకౌంట్లను నమ్మినా, పరిచయం పెంచుకున్నా, స్నేహం చేసినా చివరకు మోసం తప్పదు.

జాగ్రత్తలు
జాగ్రత్తలు
1. https తో మొదలుకాని వెబ్‌సైట్లల్లో మీ కార్డు వివరాలు ఇవ్వకూడదు. అలాంటి వెబ్‌సైట్స్ సురక్షితం కావు.
2. మీరు బ్యాంకుకు ఇ-మెయిల్ రాయాలనుకుంటే... ముందు కాల్ సెంటర్‌కు కాల్ చేసి సరైన ఇ-మెయిల్ ఐడీ తీసుకోండి.
3. మీ వ్యక్తిగత వివరాలేవీ పర్సనల్ ఇ-మెయిల్‌లో ఉంచకూడదు


Click it and Unblock the Notifications