For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.వివిధ నగరాల్లో ధరలు పరిశీలించండి.

సెప్టెంబరు 21 న పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలు పై ధర ముంబయి లో 9 పైసలు పెరిగి లీటరుకు రూ.89.69 రూపాయలకు చేరుకుంది.

By bharath
|

సెప్టెంబరు 21 న పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలు పై ధర ముంబయి లో 9 పైసలు పెరిగి లీటరుకు రూ.89.69 రూపాయలకు చేరుకుంది.

మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.వివిధ నగరాల్లో ధరలు పరిశీలించండి.

ఢిల్లీలో పెట్రోలు పై 10 పైసల పెరగడంతో లీటరుకు రూ .82.32 వద్ద నిలిచిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) తెలిపింది.

కోల్కతాలో కూడా పెట్రోలు పై 9 పైసలు పెరిగి 84.16 రూపాయలకు చేరింది. చెన్నైలో 10 పైసలు పెరిగి రూ .85.58 వద్ద ఉంది. ఇంధన ధరలు స్థానిక అమ్మకపు పన్ను లేదా విలువ జోడించిన పన్నుపై ఆధారపడి రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.

మరోవైపు డీజిల్ ధరలు ముంబైలో లీటరుకు రూ.78.42 రూపాయలుగా, ఢిల్లీలో రూ.73.87 రూపాయల చొప్పున వరుసగా రెండో రోజు కొనసాగాయి.

చెన్నై, కోల్కతాల్లో కూడా డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. లీటరుకు రూ.75.72 రూపాయలు మరియు రూ .78.10 వద్ద ధరలు కొనసాగుతున్నాయి.

గత వారంలో అల్జీరియాలో జరిగిన సమావేశంలో చమురు ధరల తగ్గింపుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ OPEC ని కోరగా చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా మారాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు ఆగస్టు మధ్యకాలం నుంచి పెరుగుతున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనపడటంతో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.

పెట్రోలు, డీజిల్పై పన్నులను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం భారత్ లో తయారు చేసిన విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) పై ఎక్సైజ్ సుంకం పెంచే యోచనలో ఉంది.

గత వారంలో కర్నాటక ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.2 రూపాయల చొప్పున తగ్గించింది.సవరించిన ధరలు సెప్టెంబరు 18 నుండి అమలులోకి వచ్చింది.

Read more about: petrol diesel
English summary

మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.వివిధ నగరాల్లో ధరలు పరిశీలించండి. | Petrol Rates Surge Again, Diesel Prices Unchanged

Petrol prices continued to rise to new highs across the country on September 21. The price of petrol in Mumbai rose by 9 paise and currently stands at Rs 89.69 per litre in the city.
Story first published: Friday, September 21, 2018, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X