For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్‌వేస్ కు చుక్కలు చూపిస్తున్న ఒక్క మగాడు

By girish
|

ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన జెట్ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. క్యాబిన్ ఎయిర్ ప్రెజర్‌ను కంట్రోల్ చేసే స్విచ్ ఆన్ చేయకపోవడంతో ప్రయాణికులకు ముక్కు, చెవుల నుంచి రక్తం కారి అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే.

ఎయిర్‌వేస్

ఎయిర్‌వేస్

గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్ బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఫ్లైట్‌లో 171 మంది ప్రయాణికులుంటే అందులో 30 మంది అనారోగ్యం పాలయ్యారు. వారిని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

 వైరల్‌గా

వైరల్‌గా

కొందరు ప్రయాణికులు ఈ ఘటనకు సంబంధించి చిత్రీకరించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ ప్రయాణికుల్లో ఒక ప్రయాణికుడు భారీగా పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఎయిర్‌వేస్ నిర్లక్ష్యం కారణంగా అనారోగ్యం పాలైన తనకు రూ.30 లక్షలతో పాటు 100 బిజినెస్ క్లాస్ అప్‌గ్రేడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తన దగ్గరున్న వీడియోను మీడియాకు ఇస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది.

 100 బిజినెస్ క్లాస్

100 బిజినెస్ క్లాస్

మరో ఐదు రోజుల పాటు ఫ్లైట్ ఎక్కొద్దని అతడికి డాక్టర్లు సూచించారు. దాంతో ఎయిర్‌లైన్స్ తరఫున హోటల్‌లో రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ప్రయాణికుడు రూ.30 లక్షలతో పాటు 100 బిజినెస్ క్లాస్ అప్‌గ్రేడ్ ఇవ్వాలని కోరుతున్నాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరిస్తున్నాడు.

ఎయిర్‌క్రాఫ్ట్

ఎయిర్‌క్రాఫ్ట్

అయితే విమాన ప్రయాణం సందర్భంలో ప్రయాణికుడు గాయపడితే ఎయిర్‌లైన్స్ పరిహారం చెల్లించాలన్న నిబంధనలున్నాయి. మరోవైపు జరిగిన ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది.

Read more about: jet airways
English summary

జెట్ ఎయిర్‌వేస్ కు చుక్కలు చూపిస్తున్న ఒక్క మగాడు | Jet Airways: Passenger Legal Action on Jet Airways

passengers, who suffered extreme physical discomfort, pain, and bleeding in some cases in a flight
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X