మార్కెట్ ముగిసే సమయానికి నష్టాల నుంచి తప్పించుకున్న నిఫ్టీ

స్టాక్ మార్కెట్‌లోఇవాళ వదంతులు స్వైర విహారం చేశాయి. కేవలం ఒక కంపెనీ బాండ్లు కాస్త ఎక్కువ వడ్డీకి అంటే డిస్కౌంటుకు బాండ్లను అమ్మిందన్న వార్త మార్కెట్‌లో దావాలంలా వ్యాపించింది. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఇచ్చిన రుణ బాండ్లను మరో కంపెనీకి 11 శాతానికి అమ్మింది. అంతకుమునుపు ఈ కంపెనీ బాండ్లను 10.25 శాతానికి అమ్మింది. అంటే 0.75 శాతం అధిక వడ్డీతో అమ్మినందుకు మార్కెట్‌లో మొత్తం ఆ సెక్టార్‌ ఇబ్బందుల్లో ఉందనే వార్తలు మార్కెట్‌లో వ్యాపించాయి. దీంతో హోం ఫైనాన్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. దీంతో ఒకదశలో నిఫ్టి 500 పాయింట్ల దాకా క్షీణించి తరవాత కోలుకుంది. మిడ్‌ సెషన్‌ తరవాత కూడా కాస్త ఒత్తిడి వచ్చినా...చివర్లో కోలుకుంది.

 మార్కెట్ ముగిసే సమయానికి నష్టాల నుంచి తప్పించుకున్న నిఫ్టీ
అయితే ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు చాలా బలహీనంగా ముగిసింది. ఉదయం క్షీణించిన షేర్లు తరవాత కోలుకోలేక పోయాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ ఏకంగా 44.80 శాతం నష్టంతో ముగిసింది. ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో క్లోజ్‌ కాగా, యూరో మార్కెట్‌ కూడా ఒక శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ నిలకడగా ఉంది. అలాగే క్రూడ్‌ ధరలు కూడా. అయినా నిఫ్టి 91 పాయింట్లు, సెన్సెక్స్ 279 పాయింట్లు నష్టపోయింది. రియాల్టి, ప్రైవేట్‌ బ్యాంకులతో పాటు బ్యాంక్‌ నిఫ్టి భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు ఇవాళ నష్టాల్లో క్లోజయ్యాయి. ముడి చమురు ధరలు, డాలర్‌ స్థిరంగా ఉన్నందున ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇన్‌ఫ్రాటెల్ బీపీసీఎల్‌, ఐఓసీ, హిందాల్కో, హెచ్‌పీసీఎల్‌ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఎస్‌ బ్యాంక్‌ టాప్‌లో ఉంది. ఈ బ్యాంక్‌ షేర్‌ ఏకంగా మూడో వంతు అంటే 29.46 శాతం క్షీణించి రూ.225 వద్ద ముగిసింది. ఇండియా బుల్స్ హౌసింగ్‌ 8.5 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతం పైగా క్షీణించాయి. అలాగే యూపీఎల్‌ 4శాతం, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3.5 శాతం చొప్పున తగ్గాయి. నిఫ్టియేతర షేర్లలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ 45 శాతం, జేపీ అసోసియేటర్స్, ఆర్‌ కామ్‌ 11 శాతం క్షీణించగా సుజ్లాన్‌ కూడా 5.5 శాతం తగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+