ఎన్నికల సమయంలో నోట్లు వెదజల్లడం గెలిచాక అందినకాడికి దోచుకోవడం సగటు రాజకీయ నాయకుడిపై సామాన్యుడిలో బలంగా నాటుకుపోయిన అభిప్రాయం ఇది. ప్రభుత్వ నిధుల్ని స్వాహా చేసి ప్రశ్నించేవాళ్లపై ఇష్టారీతిన చిందులు తొక్కే నేతలకు కొదువే లేదు. అయితే అందరూ ఇలాగే ఉంటారా?.. ఉండకపోవచ్చునేమో!.. శైలజారెడ్డి అనే ఓ జడ్పీటీసీ చేస్తున్న పని చూస్తే ఈరోజుల్లో ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారా? అని ముక్కున వేలేసుకోక మానరు.

ఇంతకీ విషయమేంటంటే ప్రజలకు ఇచ్చిన అభివృద్ది హామిలను నెరవేర్చడానికి చేవెళ్ల టీఆర్ఎస్ జడ్పీటీసీ శైలజారెడ్డి ఏకంగా తన సొంత ప్లాట్‌నే అమ్మకానికి పెట్టారు. తద్వారా వచ్చిన డబ్బుతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూసి తీవ్ర నిరాశ చెందిన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.బీజాపూర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తన ప్లాట్‌ను విక్రయించి.. తద్వారా వచ్చిన రూ.24లక్షలను మడికట్టు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించారు. మంగళవారం దీనికి భూమి పూజ నిర్వహించారు.
సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ శైలజారెడ్డి అభివృద్ది పనులు చేపడుతుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి. పూర్తిగా జవాబుదారీతనం కరువైన ప్రస్తుత రాజకీయాల్లో.. ఇచ్చిన హామిలకు కట్టుబడి శైలజారెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షనీయమే!
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications