కులాంతర వివాహం చేసుకుంటే ఇక పై రూ.2 లక్షలు
కుల విభేదాలను నిర్ములించేందుకు కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఒక పని చేసింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

అంబేద్కర్ పధకం
అంతకు ముందు ఉన్న చట్టాన్ని తాజాగా కేంద్రం సవరణ చేసింది ఈమేరకు 2013 నాటి పధకానికి కులాంతర వివాహం ద్వారా సామజిక సమగ్రతకు డాక్టర్. అంబేద్కర్ పధకం కేంద్రం సవరణ చేసింది.

వార్షిక ఆదాయం
గతంలో రూ.5 లక్షలకు మించని వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే కులాంతర వివాహం చేసుకునేవారికి ఈ డబ్బు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కేంద్రం ఈ వార్షిక ఆదాయం నిబంధనను కేంద్రం తొలగించింది. అంటే ఇక మన ఆదాయంతో ఏమి అవసరం ఉండదు.

హిందూ వివాహ చట్టం
అంతే కాదు తాజా సవరణ ప్రకారం కులాంతర వివాహం చేసుకునే వారిలో ఒకరు దళితులు ఉంటే వారికీ రూ.2 .50 లక్షలు కేంద్రం ఇస్తుంది అలాగే హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఈ కులాంతర వివాహం తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సింటుంది. ఇక రెండో పెళ్లి చేసుకొనే వారికీ ఈ పధకం వర్తించదు.

కేంద్ర ప్రభుత్వం
ఇక ఇద్దరిలో ఒకరు దళితులు ఉంటే చాలు పెళ్లి చేసుకొని మీరు అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం మీకు రూ.2.50 లక్షలు ఇస్తుంది.

కులం కోసం
ప్రభుత్వం నుంచి ఇంకా ఇతర రంగాల నుంచి ఇంత అవగాహనా ఇస్తూ ఇంత ప్రోత్సహం ఇస్తుంటే ఈరోజుకి కూడా పరువు హత్యలు , కులం కోసం చంపడం, కులం గొడవలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి.

మిర్యాలగూడలో
దీనికి ఉదాహరణ మొన్న మిర్యాలగూడలో జరిగిన ఒక కులాంతర వివాహం చేసుకున్నాడు అని తన సొంత కూతురుని కూడా చంపాలి అనుకోని తాను వివాహం చేసుకున్న భర్తని చంపించేసాడు ఒక కిరాయి తండ్రి.


Click it and Unblock the Notifications