For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ కొత్త ఫీచర్స్ అదుర్స్ యూజర్లకి పండుగే!

By girish
|

ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్, ఫీచర్స్‌తో యూజర్లకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంటుంది వాట్సప్. ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మరిన్ని కొత్త ఫీచర్స్ రానున్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి.

స్వైప్ టు రిప్లై

స్వైప్ టు రిప్లై

ఇది యూజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్. 'స్వైప్ టు రిప్లై' కొన్ని యాప్స్‌లో ఉంది. అయితే వాట్సప్‌ యూజర్లు ఎక్కువ కాబట్టి 'స్వైప్ టు రిప్లై' ఎంతో ఉపయోగపడనుంది. రిసీవ్ చేసుకున్న మెసేజ్‌‌కు రిప్లై ఇవ్వాలంటే వాట్సప్‌ ఓపెన్ చేయక్కర్లేదు. కేవలం మెసేజ్‌ని కుడి వైపు స్వైప్ చేస్తే చాలు. రిప్లై ఆప్షన్ వస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ డివైజ్‌లల్లో ఉంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లకు లేదు. త్వరలో ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 'స్వైప్ టు రిప్లై' ఫీచర్ అందుబాటులోకి రానుంది.

డార్క్ మోడ్

డార్క్ మోడ్

ఇది మరో ఫీచర్. వాట్సప్‌ ఎప్పుడూ ఒకే థీమ్‌తో ఉంటుంది. థీమ్ మార్చాలంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్‌లాగా వాట్సప్‌లో కూడా ఇకపై డార్క్ మోడ్ రానుంది. ఇప్పటికీ ట్విట్టర్, యూట్యూబ్‌లో ఉన్న కొన్ని ఫీచర్లను వాట్సప్‌ కూడా తన యాప్‌లో అందిస్తోంది.

గ్రూప్ ఛాట్స్

గ్రూప్ ఛాట్స్

గ్రూప్ ఛాట్స్‌కు మరిన్ని కొత్త ఫీచర్లు అందించనుంది వాట్సప్. ఇటీవలే గ్రూపు సభ్యులు వాట్సప్ గ్రూప్‌లో మెసేజెస్ పంపించకుండా అడ్మిన్ నిషేధించే ఫీచర్‌ని అందించింది వాట్సప్. దీంతో పాటు గ్రూప్ ఛాట్స్‌లో మరిన్ని మార్పులు చేయనుంది వాట్సప్.

 ఇండియాలో

ఇండియాలో

వాట్సప్‌ యాప్‌ను ఇండియాలో 20 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. యాప్‌లో ఫ్రెష్ లుక్ ఇచ్చేందుకు యూజర్లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది వాట్సప్. ఈ ఏడాది కూడా ఈ సరికొత్త ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లో కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్స్ ఇవ్వనుంది వాట్సప్.

Read more about: whatsapp
English summary

వాట్సాప్ కొత్త ఫీచర్స్ అదుర్స్ యూజర్లకి పండుగే! | whatsapp New Feature

New Experience provides users with new updates and features from time to time. Now Android devices will have more new features. Find out what those features are.
Story first published: Tuesday, September 18, 2018, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X