For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆపేవారు లేరా? మండిపోతున్న ధరలు ఈరోజు కూడా అంతే.

By girish
|

పెట్రోల్, డీజిల్ ధరలకు అంతూపంతూ లేకుండా పోతున్నాయి. ధరలు రూ.90ల వైపు పరుగులు పెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో లీటరు పెట్రోల్ రూ.82.16కు చేరగా.డీజిల్ రూ.73.87కు పెరిగింది.

ముంబైలో లీటరు

ముంబైలో లీటరు

ముంబైలో లీటరు పెట్రోల్ రూ.89.54కు చేరగా డీజిల్ రూ.78.42కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.83.91, డీజిల్ రూ.75.53, చెన్నైలో పెట్రోల్ రూ.85.31, డీజిల్ రూ.78గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరగడం దీనికి కారణంగా ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా దేశంలోనూ ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఇందులో తమ ప్రమేయం లేదంటూ కేంద్రం చేతులు దులుపుకుంటోంది.

జీఎస్టీ

జీఎస్టీ

అయితే రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సామాన్య ప్రజానీకం డిమాండ్ చేస్తోంది. ధరలను తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

మోదీ ప్రభుత్వానికి

మోదీ ప్రభుత్వానికి

పెట్రోల్ మరియు డీజీల్ ధరల నియంత్రణలో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరిసిస్తూ ఇటీవల కాంగ్రెస్, వామపక్షాలు, ఎన్డీయేతర పక్షాలు దేశ వ్యాప్త భారత్ బంద్ నిర్వహించాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మోదీ ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించే అవకాశముందని రెండ్రోజుల క్రితం యోగా గురువు బాబా రాందేవ్హెచ్చరించారు.

Read more about: petrol
English summary

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆపేవారు లేరా? మండిపోతున్న ధరలు ఈరోజు కూడా అంతే. | Petrol Rates Moved High Today also

Petrol and diesel prices are falling on the ground. Prices are running towards the 90s. Petrol and diesel prices have risen again on Tuesday morning across the country. In Delhi, petrol was sold at Rs. 82.16 a liter.
Story first published: Tuesday, September 18, 2018, 12:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X