For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో ఇల్లు కొనాలి అనుకుంటున్నవారికి పిడుగు లాంటి వార్త!

By girish
|

ఇన్వెస్టర్ సెంటిమెంట్లు బలహీనంగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచినా హైదరాబాద్‌లో గృహాల ధరలు 2013 నుంచి 26 శాతం పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ 'అనరాక్' వెల్లడించింది. ''ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవలకు ప్రధా న కేంద్రమైన, జనాభా సాంద్రత కలిగిన హైదరాబాద్, అధిక జీవనయోగ్య సూచీతో మెగా సిటీగా వేగంగా రూపాంతరం చెందుతోంది.

ఔటర్ రింగ్ రోడ్డు

ఔటర్ రింగ్ రోడ్డు

ఔటర్ రింగ్ రోడ్డు వల్ల నగరం సర్క్యులర్ డెవలప్‌మెంట్ లబ్ధిని పొందుతోంది. బహుళ దిశల్లో (నగర) వృద్ధికి ఇది సహాయపడుతోంది'' అని ‘అనరాక్' చైర్మన్ అనుజ్ పురీ ఈ నగర నివేదికలో పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత, ప్రభుత్వ ముఖ్య దృష్టి మౌలిక వసతుల అభివృద్ధిపైనే కావడంతో, రాజకీయ సుస్థిరత హైదరాబాద్‌కు ఆధిక్యతను సమకూర్చింది.

నూతన ప్రాజెక్టు

నూతన ప్రాజెక్టు

నూతన ప్రాజెక్టుల అనుమతికి ఆన్‌లైన్ క్లియరెన్స్ సిస్టం, యువ ఉత్సాహి పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వ నుంచి పెద్ద యెత్తున ఉన్న మద్దతు, జీవన వ్యయం తక్కువగా ఉండడం, జీవన ప్రమాణాలు చక్కగా ఉండడం, భూమి కావలసినంత అందుబాటులో ఉండడం, వివిధ రంగాల ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండడం, చెప్పుకోతగ్గ మౌలిక వసతులు హైదరాబాద్‌ను దేశంలో అత్యంత అనువైన నగరాల్లో ఒకటిగా చేస్తున్నాయి అని ఆయన అన్నారు.

 తెలంగాణ

తెలంగాణ

ఇన్వెస్టర్ సెంటిమెంట్లు బలహీనంగా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీల మూలధన విలువల్లో వృద్ధి గత ఆరేళ్ళలో సానుకూలంగానే ఉందని నివేదిక తెలిపింది. ‘‘హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ 2012 క్యూ 4 నుంచి సగటు ధరల్లో సరళ రేఖలో సాగిన వృద్ధిని వీక్షించింది. అది 2012-17 కాలంలో 5 శాతం చక్రీయ వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2012 క్యూ 4 నుంచి 2018 క్యూ 1 వరకు మూలధన విలువలో 26 శాతం వృద్ధిని చూసింది'' అని ఆ నివేదిక తెలిపింది

గృహాల అమ్మకాలు

గృహాల అమ్మకాలు

గృహాల అమ్మకాలు 2017లో 21 శాతం పెరిగాయని ‘అనరాక్' పేర్కొంది. సానుకూల మార్కెట్ సెంటిమెంట్లకు తోడు, ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రధానంగా పశ్చిమ మండలంలో హౌసింగ్ డిమాండ్ పెరిగిందని చెప్పింది. నిర్మాణం పూర్తయి అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య 2017 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని పేర్కొంది

 పరిస్థితి మెరుగ్గానే

పరిస్థితి మెరుగ్గానే

నిజానికి, అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య విషయంలో అనేక ఇతర నగరాలకన్నా హైదరాబాద్‌లో పరిస్థితి మెరుగ్గానే ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో 2016 క్యూ2లో అమ్ముడుపోని మొత్తం యూనిట్లు 35,560 కాగా, 2017లో అదే త్రైమాసికంలో వాటి సంఖ్య దాదాపు 14 శాతం తగ్గింది. వాటి సంఖ్య 2018 క్యూ 2 నాటికి మరింతగా 13 శాతం తగ్గింది. అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య రెండేళ్ళ వ్యవధిలో దాదాపు 29 శాతం తగ్గింది'' అని నివేదిక పేర్కొంది.

Read more about: hyderabad
English summary

హైదరాబాద్ లో ఇల్లు కొనాలి అనుకుంటున్నవారికి పిడుగు లాంటి వార్త! | Hyderabad Real Estate Increased from 2013

Even though investor sentiments are weak, housing prices in Hyderabad have risen by 26 per cent since 2013, despite the special Telangana movement, the property consultant Anarak said.
Story first published: Tuesday, September 18, 2018, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X