For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతు తలుచుకుంటే ఇలాగే ఉంటుంది. షాక్ లో ఉన్న ఊరి జనం!

By girish
|

భారతదేశంలో రైతులంటే ఎప్పుడూ నష్టాలతో వ్యవసాయం చేసేవాళ్లే అనుకుంటాం. కానీ మహారాష్ట్రలో ఓ రైతు రూ.1.3 కోట్ల విలువైన జాగ్వార్ కొని అందర్నీ ఆశ్చర్యపర్చాడు. అంతే కాదు ఈ సందర్భంగా బంగారం పూత పూసిన స్వీట్లు పంచి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.

 ధయానీ గ్రామానికి

ధయానీ గ్రామానికి

కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు చెందిన రైతు మెర్సిడెస్ బెంజ్ కార్ కొన్నాడని తెలుసుకొని అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మరో రైతు ఇలాగే వార్తల్లో నిలిచాడు. ధయానీ గ్రామానికి చెందిన సురేష్ తన కలల కారును కొన్నాడు. కలల కారంటే లక్షల్లో వచ్చేది కాదు అది జాగ్వార్ ఎక్స్‌జే సెలూన్ మోడల్. పుణెలో ఆన్‌రోడ్ ధర రూ.1.3 కోట్లు.

స్వీట్లు

స్వీట్లు

అంత ఖరీదైన కారు కొని నేరుగా గ్రామానికి తీసుకొచ్చాడు. అంతే... ఆ సీన్ చూసి గ్రామస్తులు షాకయ్యారు. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా స్వీట్లు ఆర్డర్ చేశాడు. ఆ స్వీట్ కిలో రూ.7,000. ఎందుకంటే బంగారం పూత పూసిన స్వీట్లు అవి. వాటిని ఊరంతా పంచుతూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ రైతు

 బంగారం పూతతో

బంగారం పూతతో

రైతు కొడుకు మాట్లాడుతూ మేం ఇటీవలే కొత్త జాగ్వార్ లగ్జరీ కార్ కొన్నాం. ఆ సందర్భాన్ని ఇలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. స్వీట్లు కూడా కార్‌లా లగ్జరీగా, గ్రాండ్‌గా ఉండాలనుకున్నాం. అందుకే బంగారం పూతతో స్వీట్లు ప్రత్యేకంగా చేయించాం.

పొలంలో పార్క్

పొలంలో పార్క్

ఓ రైతు ఇలా జాగ్వార్ కార్ కొన్నాడన్న వార్త ఇప్పుడు మహారాష్ట్రలో హాట్‌ టాపిక్‌గా మారింది. బడబడా వ్యాపారవేత్తలకే కలగా మిగిలిపోయే ఈ కార్‌ను తన పొలంలో పార్క్ చేసి ఆ రైతు వ్యవసాయం చేసే దృశ్యం ఎంతమందికి షాకివ్వనుందో.

Read more about: business
English summary

రైతు తలుచుకుంటే ఇలాగే ఉంటుంది. షాక్ లో ఉన్న ఊరి జనం! | Pune Farmer Buy Jaguar Car

The farmers in India always suffer from losses. But a farmer in Maharashtra, Jagwar, worth Rs 1.3 crore, surprised everyone. Not only that, the gold-plated sweets that he did make it all.
Story first published: Monday, September 17, 2018, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X