ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉండి భారతీయ అధికారులు, బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పారిపోవడానికి కారణం ఎవరు? మాల్యా భారతదేశం వదిలి వెళ్లిపోవడానికి దాదాపు నెల రోజుల ముందే మాల్యా తమకు దాదాపు రూ. 2వేల కోట్లు బాకీ ఉన్నారని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది.

అప్పటికి
డెట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)కి సమర్పించిన డిక్లరేషన్‌లో భాగంగా ఈ విషయం తెలిపింది. ఆ ట్రైబ్యునల్ అప్పటికి మాల్యా, ఆయన కంపెనీలు చెల్లించాల్సిన బాకీల విషయం చూస్తోంది.

ఎస్‌బీఐకే
ఎస్‌బీఐ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం 2014 జనవరి 31 నాటికి ఉన్న బాకీలను ఆ నివేదికలో తెలిపాయి. వాటిలో ఒక్క ఎస్‌బీఐకే మాల్యా దాదాపు రూ. 2,043 కోట్లు కట్టాల్సి ఉంది. అన్ని బ్యాంకులకు కలిపి రూ. 6,963 కోట్లు బాకీ ఉన్నారు. కొన్ని వారాల తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఫిబ్రవరి 28న ఎస్‌బీఐ సీనియర్ అధికారులను కలిశారు. మాల్యా దేశం వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆ సమావేశంలో బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

విజయ్ మాల్యా
అప్పుడు వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, మాల్యా దేశం వదిలి వెళ్లకుండా ఉత్తర్వులు పొందాలని దవే వారికి సూచించారు. దానికి నాటి ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య కూడా సరేనన్నారు. మర్నాడు సోమవారం కావడంతో వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని దవే సూచించారు. ఆరోజు ఆయన కోర్టుకు వెళ్లినా, ఎస్‌బీఐ అధికారులు మాత్రం ఎవరూ అక్కడకు రాలేదు. అలాగే, మాల్యా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశించాలన్న పిటిషన్ కూడా దాఖలు కాలేదు. సరిగ్గా రెండు రోజుల తర్వాత.. అంటే మార్చి 2న విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోయారు

రికవరీ
అంతటి సీనియర్ న్యాయవాది చెప్పిన తర్వాత, పైగా స్వయంగా బ్యాంకు ఉన్నతాధికారులకే అనుమానం వచ్చిన తర్వాత కూడా వాళ్లు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. అప్పుడే కోర్టుకు వెళ్లి ఉంటే, మాల్యా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని.. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడగలిగే అవకాశం ఉండేది. అయితే, తమవైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని ఎస్‌బీఐ వర్గాలు అంటున్నాయి. బాకీ ఉన్న మొత్తాలను రికవరీ చేసుకోడానికి బ్యాంకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications