ఐటీ కంపెనీకి భారీ ఫైన్ కారణం ఏంటో తెలుసా?

హెచ్-1బి వీసాల మీద వచ్చిన ఉద్యోగులకు వాళ్లకు ఇవ్వాల్సిన జీతాల కంటే తక్కువ ఇచ్చినందుకు అమెరికాలోని ఓ ఐటీ కంపెనీకి దాదాపు రూ. 2.5 కోట్లకు పైగా ఫైన్ పడింది. ఈ మొత్తాన్ని 12 మంది ఉద్యోగులకు ఇవ్వాల్సిందిగా రెడ్‌మండ్ ప్రాంతంలోని సదరు కంపెనీని అమెరికా కార్మిక వేతనాలు, గంటల విభజన విభాగం ఆదేశించింది.

 వీసాల

వీసాల

ఈ సంస్థ హెచ్-1బి వీసాల మీద కొంతమందిని అమెరికాకు పిలిపించుకుని, వాళ్లకు ఇవ్వాల్సిన వేతనాల కంటే తక్కువగా ఇస్తున్నట్లు అక్కడి కార్మిక శాఖ గుర్తించింది.ఫలితంగా ఆయా ఉద్యోగులకు పరిహారం ఇప్పించడంతో పాటు కంపెనీకి జరిమానా కూడా విధించింది. తమకంటే చాలా సీనియర్లు చేయాల్సిన పనిని చేస్తున్నా.. హెచ్-1బి వీసాల మీద వచ్చిన కంప్యూటర్ ఎనలిస్టులు, కంప్యూటర్ ప్రోగ్రామర్లకు కేవలం ప్రాథమిక స్థాయి ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు మాత్రమే ఇస్తున్నట్లు గుర్తించారు. తాను పని కల్పించలేనపుడు ఇవ్వాల్సిన వేతనాన్ని కూడా పీపుల్ టెక్ కంపెనీ ఆ ఉద్యోగులకు ఇవ్వలేదని కార్మిక శాఖ తెలిపింది.

అమెరికాలో

అమెరికాలో

అమెరికాలో ఉద్యోగులకు కొరత ఉన్నప్పుడు ఆ స్థానాల్లో బాగా నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను ఎక్కువ జీతాలిచ్చి పిలిపించుకోవడమే హెచ్-1బి వీసా ఉద్దేశమని కార్మికశాఖ తాత్కాలిక జిల్లా డైరెక్టర్ కేరీ ఆగిలర్ తెలిపారు.

30 కంపెనీలను

30 కంపెనీలను

అమెరికన్ ఉద్యోగాలను కాపాడుకోవడం, చట్టాలకు అనుగుణంగా పనిచేసేవారికి అనుమతి ఇవ్వడం తమ ఉద్దేశమని, అలాగే ఏ ఒక్కరూ తమకు చట్టబద్ధంగా దక్కాల్సిన వేతనాల కంటే తక్కువ పొందకూడదని ఆమె చెప్పారు. ఇలా హెచ్-1బి వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్న దాదాపు 30 కంపెనీలను అమెరికా కార్మిక శాఖ గుర్తించింది. 2013 నాటి జాబితా ప్రకారం చూస్తే ఎలా ఎగవేసేవారిలో ఎక్కువ మంది ఎన్నారై కంపెనీ యజమానులే ఉంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+