పేటీఎం ద్వారా జరిపే పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై డిస్కౌంట్ స్కీంను, క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది పేటీఎం.

పెట్రోల్ ధరలు
ఒకవైపు దేశ వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోతుంటే రోజురోజుకీ రాకెట్ లాగా పై దూసుకుపోతున్న ధరలను చూసి వాహనదారుల నడ్డి విరుగుతోంది.దీనికి సామాన్యుల ప్రజలకి ఉపశమనం కలిగించేలా పేటీఎం తాజా ప్రకటన చేసింది. పేటీఎం ద్వారా జరిపే పెట్రోల్ మరియు డీజిల్ కొనుగోళ్లపై డిస్కౌంట్ స్కీంను, క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.

క్యాష్ బ్యాక్
పెట్రోల్, డీజిల్ కొనుగోలు చెల్లింపులపై రూ. 7500 దాకా డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనున్నట్టు వెల్లడించింది. పేటీఎం.కాం అందించిన సమాచారం ప్రకారం ఇందుకు కనీస లావాదేవీ రూ.50. ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఆగష్టు 1, 2019 వరకు చెల్లుతుంది.

ఎస్‌ఎంఎస్
పెట్రోల్ బంకు దగ్గర మొదటి కనీస లావాదేవీ ముగిసిన అనంతరం, వినియోగదారులకు రూ. 7500 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్' లో పాల్గొనమంటూ ఒక ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఇందులో ఒక ప్రోమో కోడ్‌ను కూడా జత చేస్తుంది.

లావాదేవీ
దీని ద్వారా 11, 21, 31, 41లావాదేవీల అనంతరం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తుంది. అంటే ప్రతీ పదవ లావాదేవీ అనంతరం రూ.1350 క్యాష్ బ్యాక్ వస్తుంది.

ట్రాన్సాక్షన్
ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.7500 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను వినియోగదారులు పొందవచ్చు. లావాదేవీ ముగిసిన 48 పనిగంటల లోపు ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే ఈ ప్రోమో కోడ్‌తో మాత్రమే వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఒక వారంలో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినా ముందు జరిగిన లావాదేవీకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications