For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న డ్రైవర్లు నేడు ఓనర్లు ఎక్కడో తెలుసా? మీరే చూడండి.

By girish
|

తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిమ్ నిరుద్యోగ యువత సొంత కార్లు తీసుకోని మురిసిపోయారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా ముస్లిమ్ సోదరులకు ఏ ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించడంలో చొరవ తీసుకోలేదు అని కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి కార్లు అందచేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం

డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం

డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం పధకం క్రింద వివిధ జిల్లాలకు చెందిన 342 మంది డ్రైవర్లను అర్హులుగా ఎంపిక చేసిన మైనారిటీ కార్పొరేషన్ అధికారులు నాంపల్లి హ్యూజ్ హౌస్ దగ్గర ఏర్పాటు చేసిన కారిక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమ్మద్ అలీ మరియు హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి లబ్ధిదారులకు వాహనాల తాళాలు అందచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా

రాష్ట్రవ్యాప్తంగా

రాష్ట్రవ్యాప్తంగా ఈ పధకానికి 3000 దరఖాస్తులు రాగ తొలి విడతలో 340 మందిని అర్హులుగా గుర్తుంచి రూ.7 .60 లక్షలు విలువైన స్విఫ్ట్ డిజైర్ కార్లను అందచేశారు. ఇందులో రూ.4 .40 వేలు సబ్సిడీ కాగా లబ్ధిదారులు రూ.50 వేలు మాత్రమే చెల్లించారు మిగతాది రూ.2 .70 లక్షలు బ్యాంకులు రుణం అందించాయి.

కారుతో పాటు

కారుతో పాటు

కారుతో పాటు ప్రతి డ్రైవర్ కే టూల్ కిట్, సెల్ ఫోన్ , జాకెట్ జిపిఅర్ఎస్ టూల్ కిట్ అందచేశారు. అంతేకాదు డ్రైవర్ కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత ప్రమాద భీమా సౌకర్యం కలిపించారు.

డ్రైవర్ మాటలలో

డ్రైవర్ మాటలలో

ఈ పధకాన్ని పొందిన ఒక డ్రైవర్ మాటలలో 15 సంత్సరాలుగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న ప్రైవేట్ డ్రైవర్ గా ఒక వ్యక్తికి దగ్గర పని చేస్తున్న ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న ఈ పధకం గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్న ఒక 8 నెలనెలకి కారు వచ్చింది. పెద్ద, మధ్యతరగతి కుటుంబాల మంచి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మరియు ఉపముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారి జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్పారు.

 సబ్సిడీ

సబ్సిడీ

నెలకి రూ.10 వేలతో నా జీవితాన్నిడ్రైవర్ గా మొదలు పెట్టాను ప్రభుత్వమే లోన్ తో పాటు సబ్సిడీ కింద సొంత కారును అందించడం జీవితంలో మర్చిపోలేని ఘటన అని పెద్ద చదువులు చదువే ఆర్ధిక స్థోమత లేక ఉపాధి పొందే అవకాశాలు లేక యువకులు చెడు దారి పడుతున్నారు అని చెప్పాడు.

Read more about: telangana
English summary

నిన్న డ్రైవర్లు నేడు ఓనర్లు ఎక్కడో తెలుసా? మీరే చూడండి. | Cars Distributed Under Driver Empowerment Scheme

Muslim youth unemployed by Telangana Minority Corporation When the freedom comes and over 70 years, the Muslim brothers have not taken the initiative to provide self-employment to the subsidized loans provided by the corporation.
Story first published: Friday, September 14, 2018, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X