తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ అంటే కొన్ని మీటింగ్లు తప్పకుండా ఉంటాయి, భవిషత్తులో పార్టీ పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఉండాలి అని అలాగే పార్టీ విధివిధానాలు ఎలా ఉండాలి అని ఈ మీటింగులలో చర్చలు జరుపుతుంటారు నాయకులూ. అదే రకంగా పార్టీ లావాదేవీలు కూడా చేస్తుంటారు.

జనసేన అధినేత
రాజకీయ పార్టీ అంటే ఈ మాత్రం రహస్య మీటింగ్లు ఉంటాయి అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో పార్టీ ఫండ్ కోసం విరాళాలు సేకరించారు. మినియం రూ.10 లక్షలు విరాళం ఇవ్వాలి అని నిబంధన పెట్టారు అని సమాచారం.

విరాళాల సేకరణ.
అంతే కాదు మొత్తం నేతలందరికీ ఈ మీటింగ్ జరుగుతున్నట్లు ఆహ్వానం కూడా పంపారు. మొత్తంగా ఇది అంతా అధికారకంగా జరుగుతున్న విరాళాల సేకరణ. ఇంత వరకు సినిమా బాగానే ఉంది. ఇంతలో ఈ మీటింగ్ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అంటూ ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసింది.

కొన్ని దృశ్యాలు
జనసేన అధినేత ఏర్పాటు చేసిన ఒక సమావేశం ఇది ఒక రహస్య సమావేశంగా చిత్రీకరించి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసాం అంటూ ఆ పార్టీ డబ్బులు వసూల్ చేస్తున్నట్లు కొన్ని దృశ్యాలు ప్రచారం చేసింది. అయితే అది రహస్య సమావేశం కాదు అని పార్టీ కోసం విరాళాలు సేకరిస్తున్నాము అని జనసేన టీం క్లారిటీ ఇచ్చారు.

ఇంకేముంది
ఇంకేముంది ఇలా క్లారిటీ వచ్చింది అంతే ఆ రిపోర్టర్ పై మరియు ఆ ఛానల్ యాజమాన్యం పై నెటిజన్లు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే రాజకీయ నిపుణులు అందరు మండిపడుతున్నారు.

దృశ్యాలు
ఇక పవన్ కళ్యాణ్ డబ్బులు వసూల్ చేస్తున్నాడు అని లైవ్లో ప్రోగ్రాం పెట్టుకొచ్చారు ఆ దృశ్యాలు మీకోసం టెలికాస్ట్ చేస్తున్నాము అని చెప్పారు. అంతేకాదు రిపోర్టర్ ని కూడా లైవ్లో తీసుకొచ్చి అతనితో కూడా చెప్పించేసారు.

పవన్ కళ్యాణ్ ఆడిటర్
పవన్ కళ్యాణ్ ఆడిటర్ రత్నం డబ్బులు వసూల్ చేస్తున్నాడు అని రిపోర్టర్ చెప్పాడు. డబ్బులు కాష్ లేక చెక్ రూపంలో ఇస్తున్నారా అని ఆ వీడియోలో ఉన్నాయి అని రిపోర్టర్ చెప్పకొచ్చాడు. ఇదంతా కూడా లైవ్లో జరిగిన దృశ్యం. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే రిపోర్టర్ లైవ్లో బుక్ అయ్యాడు పాపం అది మాత్రం తెలుసుకోలేకపోయారు

ఎలా బుక్ అయ్యాడో
ఇంతకీ ఎలా బుక్ అయ్యాడో తెలుసా ఇలా పెద్ద పెద్ద హోటళ్లలో మీటింగ్ పెడితే అది రహస్య మీటింగ్ ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇక్కడ ఆహ్వాన పత్రిక నెటిజన్లు సైతం పోస్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు అని మీడియా ముసుగులో రాజకీయ మాఫియా రాజ్యం ఏలుతోంది అని అన్ని ఛానెళ్లు కూడా ఒకే పార్టీకి కొమ్ముకాస్తున్నాయి అని నెటిజన్లు త్రీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

శతాగ్ని
ఇక అలాగే జనసేన పార్టీ పత్రిక శతాగ్ని కూడా ఈ సంఘటనతో ఆవేశంగా ఊగిపోయింది. రహస్య సమావేశాలకు మరియు ఆహ్వానం ఇచ్చి జరిపిన సమావేశాలు ఆ మాత్రం తేడా తెలీకుండా ఛానెళ్లు నడుపుతున్నారా అంటూ వారి అజ్ఞానానికి చింతిస్తున్నాము అంటూ యథేవ చేసింది.

జనసేన టీం
ఏదిఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బురదచెల్లి ఒక నింద వేయాలి అని చూసిన వారిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ మరియు జనసేన టీం వారిని బురదలోకే తోసేసింది.
మరి ఇప్పటికైనా వారు మారుతారో లేక ఇలాగే ఉంటారో వారి విజ్ఞతకు వదిలేద్దాం. ఈ మొత్తం సమాచారం మేము సుమన్ టీవీ నుంచి తీసుకోని మీకు చెబుతున్నాము.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications