For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెట్రో స్పీడ్ దాటుతున్న పెట్రోల్ ధరల స్పీడ్ సెంచరీకి దగ్గరగా ధరలు

By Sabari
|

పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేందుకు పరుగులు పెడున్నాయి. ఒకవైపు రూపాయి పతనం, మరోవైపు దిగుమతులు ఖరీదు కావడంతో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధానిలో తొలిసారి లీటరు పెట్రోలు ధర రూ. 80.50 దాటింది. ఓ వైపు పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షం ఈ నెల 10న (సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఆదివారం

ఆదివారం

ఆదివారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.50, డిజీల్ రూ.72.61 పైసలుగా నమోదు అయింది. కాగా ఇవాళ ఉదయం పెట్రోల్ ధర12 పైసలు, డీజిల్ 10 పైసలు పెరిగింది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.89, డీజిల్ రూ.77.09గా ఉంది.

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ

మెట్రో నగరాలన్నింటితో పోలిస్తే ఢిల్లీలో పెట్రోధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. పన్నులు తక్కువగా ఉండటం వల్లే ఇలా ఉందని తెలుస్తోంది. ముంబైలో పెట్రో ఉత్పత్తుల మీద పన్నులు చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న పెట్రోధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పుడు స్వదేశంలో ధర తగ్గించాలంటే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని పలు వర్గాల నుంచి డిమాండు వస్తున్నా.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు.

ఆగస్టు రెండోవారం

ఆగస్టు రెండోవారం

ఆగస్టు రెండోవారం నుంచి చూస్తే పెట్రోల ధర రూ. 3.24, డీజిల్ రూ. 3.74 చొప్పున పెరిగాయి. అవెురికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బాగా పడిపోవడంతో దిగువుతులు ఖరీదయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధ రలలో దాదాపు సగం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ. 19.48, డీజిల్‌పై రూ. 15.33 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది. దానికితోడు రాష్ట ప్రభుత్వాలు వ్యాట్ కూడా వేస్తాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత తక్కువగా 6% వ్యాట్ మాత్రమే విధిస్తారు. పెట్రోలు మీద ముంబైలో అత్యధికంగా 39.12%, డీజిల్ మీద అత్యధికంగా తెలంగాణలో 26% వ్యాట్ ఉంది. ఢిల్లీలో పెట్రోలుపై 27%, డీజిల్‌పై 17.24% చొప్పున వ్యాట్ ఉంది.

ఎక్సైజ్ పన్ను

ఎక్సైజ్ పన్ను

కేంద్ర ప్రభుత్వం 2014 నవంబరు నుంచి 2016 జనవరి వరకు తొమ్మిది సార్లుగా పెట్రోలుపూ రూ. 11.77, డీజిల్‌పై 13.47 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. తర్వాత గత సంవత్సరం అక్టోబరులో లీటరుకు రూ. 2 చొప్పున తగ్గించింది. 2014-15లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై ఎక్సైజ్ పన్ను రూపేణా రూ. 99,184 కోట్లు మాత్రమే రాగా, 2017-18లో అది ఏకంగా రూ. 2,29,019 కోట్లయింది.

Read more about: petrol
English summary

మెట్రో స్పీడ్ దాటుతున్న పెట్రోల్ ధరల స్పీడ్ సెంచరీకి దగ్గరగా ధరలు | Petrol Price Hike Today Also

petrol and diesel price increased today also and due to this monday all political parties doing bharath bandh.
Story first published: Sunday, September 9, 2018, 11:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X