For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంగంలోకి దిగిన జనసేనాని తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన!

By Sabari
|

పెరగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా విపక్షాలు చేపట్టిన భారత్‌ బంద్‌కు జనసేన పార్టీ మద్దతు పలికింది.

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

ఆ రోజు ఇతర పార్టీలతో పాటు జనసేన కార్యకర్తలు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పవన్ అన్నారు.

పెట్రోల్‌ను

పెట్రోల్‌ను

పెట్రోల్‌ను జీఎస్టీలో చేర్చాలని జనసేన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందని చెప్పారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మన దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెరగడం గర్హనీయమని పవన్ అన్నారు.

ఎగబాకింది

ఎగబాకింది

ఏరోజుకి ఆ రోజు పెట్రోల్ ధరల్లో మార్పు వస్తుండడంతో వాహనదారుల జేబుకి చిల్లు పడుతోంది. శుక్రవారం రోజు పెట్రోల్ మీద లీటర్‌కు 48 పైసలు పెరిగింది. శనివారం మరో 39 పైసలు ఎగబాకింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.80కి చేరింది. హైదరాబాద్‌లో రూ.85కి పెరిగింది.

అమెరికా డాలర్

అమెరికా డాలర్

అయితే, అమెరికా డాలర్ విలువ పెరగడం, ఇరాన్, వెనుజులా, టర్కీల్లో పెట్రోల్ ఉత్పత్తి తగ్గడం వల్ల పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు.

Read more about: petrol
English summary

రంగంలోకి దిగిన జనసేనాని తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన! | Pavan Kalyan Supports Bharath Bandh on Petrol Rates

పెరగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా విపక్షాలు చేపట్టిన భారత్‌ బంద్‌కు జనసేన పార్టీ మద్దతు పలికింది.
Story first published: Sunday, September 9, 2018, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X