ఫ్రెండ్ తో అప్పు చేసి కొన్నాడు.. కోటీశ్వరుడు అయ్యాడు ఎలాగో తెలుసా?

ఒక్కోసారి అదృష్టం మనల్ని అందలమెక్కిస్తుంది. అప్పు కూడా అదృష్టలక్మీని ఇంటికి ఆహ్వానిస్తుంది. పంజాబ్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది.

మనోజ్‌కుమార్‌

మనోజ్‌కుమార్‌

అప్పు చేసి మరీ కొన్న లాటరీ టికెట్‌కి బంపర్ ఆఫర్ తగిలింది. ఇంకేముంది కూలీ కాస్తా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. సంగ్రూర్ జిల్లాలో నివాసముండే మనోజ్‌కుమార్‌కి లాటరీ టికెట్స్ కొనడం అలవాటు. ఈ నేపథ్యంలో పంజాబ్ స్టేట్ లాటరీస్ సంస్థలో తరచూ టికెట్స్ కొనేవాడు.

పంజాబ్ స్టేట్ రాఖీ బంపర్

పంజాబ్ స్టేట్ రాఖీ బంపర్

ఆగస్టులో కూడా టికెట్ కొందామనుకున్నాడు. కానీ.. తన దగ్గర కనీసం టికెట్ కొనేందుకు రూ.200లు కూడా లేవు.. దీంతో సన్నిహితుడి దగ్గర అప్పుచేసి మరీ ఆగస్టు 29న టికెట్‌ కొన్నాడు. ‘పంజాబ్ స్టేట్ రాఖీ బంపర్ 2018' నిర్వహించిన ఈ లాటరీలో రెండు టికెట్లకు మొదటి బహుమతిగా రూ.1.5 కోట్ల చొప్పున అందించింది. ఇందులో మనోజ్ కూడా ఉన్నాడు.

 కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

ఎన్నో ఏళ్లుగా టికెట్స్ కొంటున్న మనోజ్‌కి పెద్దమొత్తంలో లాటరీ తగలడంతో అతడి ఆనందానికి అంతేలేకుండాపోయింది. ఇక తన కష్టాలు మొత్తం పోయాయి అని ఎంతో ఆనందంగా ఉంది అన్ని చెప్పాడు.తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా సంతోషపడ్డారు.

 మనోజ్ సంతోషాన్ని

మనోజ్ సంతోషాన్ని

అంతా కలలా ఉంది టికెట్స్ కొనడానికి ఇన్నిరోజులుగా అప్పుచేస్తున్నాను. ఇన్నిరోజులకు అదృష్టం వరించి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది.. ఇక నా కుటుంబమంతా ఆనందంగా బతకొచ్చు' అని మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.ఇక మనోజ్ కి అప్పు ఇచ్చిన తన ఫ్రెండ్ కూడా చాలా సంతోషపడ్డాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+