కొందరి విజయగాధలు వింటుంటే అచ్చం సినిమా స్టోరిలలాగా ఉంటాయి అయితే నిజజీవితంలో ఇది సాధ్యమా? అని అంతా అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు మేము చెప్పే ఒక వ్యక్తి గురించి మీరు వింటే నిజమనే నమ్మకతప్పదు ఎమ్మో.

దిలీప్ శాంగ్వి
కేవలం రూ.10 వేల రూపాయిలతో వ్యాపారం ప్రారంభించి వేల కోట్లు సంపాదించాడు అంటే ఆషామాషీ కాదు కదా. మన ఇండియాలోనే రెండొవ అత్యంత ధనవంతుడిగా నిలిచినా వ్యక్తి ఎవరో కాదు సన్ ఫార్మస్యూటికల్స్ కంపెనీ అధినేత దిలీప్ శాంగ్వి.

గుజరాత్
దిలీప్ శాంగ్వి రాష్ట్రము గుజరాత్ ఇక అయన తండ్రి కలకత్తాలో ఫార్మా హోల్ సేల్ బిజినెస్ ఉండేది . దిలీప్ అక్కడే చదువుతూ తండ్రికి వ్యాపారంలో సహాయం చేసే వాడు.ఇక ఈయన కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక ముంబైకి షిఫ్ట్ అయ్యారు.

సొంతంగా బిజినెస్
ఇక ముంబైకి వెళ్ళాక అక్కడ సైకో తెరపి డ్రగ్స్ ప్రమోషన్ కోసం కొద్దీ రోజులు అక్కడ పని చేశారు. ఇక కొంత కాలం గడిచినా తర్వాత సొంతంగా బిజినెస్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రిని కలిసి వ్యాపార విషయం చెప్పాడు. అయన కూడా సరే అన్నాడు.

రూ.10 వేలు
ఇక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే డబ్బులు కావాలిగా ఆలా తన తండ్రితో రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఇక 1982 లో సన్ ఫార్మా స్థాపించారు. గుజరాత్ లో మొదలు పెట్టాడు వ్యాపారం తన స్నేహితుల సహాయం కూడా తీసుకోని వ్యాపారం ప్రారంభించాడు.

పోటీ
మొదట సైకియాట్రిక్ మందులతో తన వ్యాపారం మొదలు పెట్టాడు. ఇలా గుజరాత్ లో 5 ప్రాంతాలలో వ్యాపారం మొదలు పెట్టాడు ఇలా ఒక 5 ఏళ్ల తర్వాత ఇది లేదు అని లేకుండా అన్ని మందులు తయారు చేశారు. ఇక తన కంపెనీ ధాటికి ఏ కంపెనీ పోటీ పడలేకపోయింది. ఆ క్రమంలోనే కొన్ని కంపెనీలని టేక్ ఓవర్ చేసుకున్నాడు.

టేక్ ఓవర్
1997 లో కారకో ఫార్మాని కొనుగోలు చేసాడు. ఆ కంపెనీని తీసుకునేటప్పుడు చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అయినా సరే దిలీప్ ఎవరిమాటా వినలేదు టేక్ ఓవర్ చేసిన కంపెనీని ఎవరు ఊహించని విధంగా లాభాల బాటలో నడిపించాడు.

యూరోప్ మరియు అమెరికా
ఆలా చాలా తక్కువ కాలంలోనే సన్ ఫార్మా యూరోప్ మరియు అమెరికా మార్కెట్లోకి ఎంటర్ అయింది. 2012 లో యుఆర్ఎల్ ఫార్మా గెలుచుకున్నారు తర్వాత డ్యూసో ఫార్మా కొనడం ఒక మేజర్ స్టెప్.

దాదాపు
ఒక నివేదిక ప్రకారం దిలీప్ కంపెనీ విలువ రూ.16 .9 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1700 కోట్లు దంతో పటు ర్యాంబాక్సీ లో సగం వాటా సన్ ఫార్మా దే దింతో దిలీప్ కంపెనీ ప్రపంచములోనే నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది. ప్రపంచంలోనే 5 వ ఫార్మా కంపెనీగా నిలిచింది.

ముకేశ్ అంబానీని
ఇక ఒకసారి 2015 లో ముకేశ్ అంబానీని సైతం వెనక్కి నెట్టి ధనవంతుల మొదటి స్థానంలో నిలిచారు దిలీప్ . ఇక అవకాశాలని అందిపుచ్చుకోవడం వ్యాపారుల మొదటి లక్షణం అంటారు దిలీప్. ఒక విజిన్ మరియు ప్లాన్ అమలు చేసే టీం ఉంటె వ్యాపారం విజయం వస్తుంది అని అంటారు దిలీప్.

చిత్తశుద్ధి
వ్యాపారం అంటే నిరంతరం నేర్చుకోవడమే అంతేకాని నాకు అంతా తెలుసు అంటే మీరు పప్పులో కాలు వేసినట్లే అని అంటారు దిలీప్ నిజమే చిత్తశుద్ధి , కష్టించే మనస్తత్వం దిలీప్ శాంగ్విని ఈ స్థాయిలో నిలబెట్టింది అంటే సందేహం లేదు.


Click it and Unblock the Notifications