జియో ఒకే సారి రెండు బంపర్ ఆఫర్లు 10 జీబీ డేటా మరియు ఫ్లాష్ సేల్!

సరిగ్గా రెండేళ్ల క్రితం 2016 సెప్టెంబర్ 5న భారత మార్కెట్లోకి రిలయన్స్ జియో తన సేవలను ప్రారంభించి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. జియో లాంచ్‌ అయిన కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. వినియోగదారులకు ఉచిత జీవిత కాల కాలింగ్ సదుపాయం కల్పించి సంచలనం సృష్టించింది. తాజాగా రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

సెలబ్రేషన్స్ ప్యాక్ పేరుతో ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్లు వెల్లడించింది. మైజియో యాప్‌లోకి వెళ్లి.. మై ప్లాన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. మొత్తం 10జీబీ డేటాను ప్రీపెయిడ్‌ వినియోగదారులు ఉచితంగా పొందనున్నారు. ఈ బంపర్ ఆఫర్ సెప్టెంబర్ 11తో ముగియనుంది. క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ ఆఫర్‌ను రిలయన్స్‌ జియో సంస్థ గురువారం ప్రకటించింది. ఖాళీ డెయిరీ మిల్క్ పేపర్(రాపర్) ఫొటోను మైజియో యాప్‌లో అప్‌లోడ్ చేస్తే ఉచితంగా 1జీబీ డేటాను యూజర్లకు ఇవ్వనున్నట్లు తెలిపింది.

జియో ఒకే సారి రెండు బంపర్ ఆఫర్లు 10 జీబీ డేటా మరియు ఫ్లాష్ సేల్!

రిలయెన్స్ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు Jio.com వెబ్‌సైట్‌లో నిర్వహించనుంది కంపెనీ. ఈ ఏడాది చివరి నాటికి జియోఫోన్‌తో పాటు జియోఫోన్ 2 కలిపి 10 కోట్ల యూనిట్స్ అమ్మాలన్నది రిలయెన్స్ లక్ష్యం. ఇప్పటివరకు 'జియో ఫోన్ 2' మూడు ఫ్లాష్ సేల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి.

జియో నుంచి వచ్చిన ఈ హై-ఎండ్ మోడల్ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. ధర రూ.2,999 మాత్రమే. క్వర్టీ కీప్యాడ్, వెడల్పు డిస్‌ప్లేతో జియోఫోన్ 2 ఆకట్టుకుంటోంది. 4జీ ఫీచర్‌‌, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై, జీపీఎస్‌తో పాటు ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్ యాప్స్‌ని సపోర్ట్ చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత. మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.

జియో ఫోన్ 2 ఎలా కొనాలి?

రిలయెన్స్ అఫిషియల్ వెబ్‌సైట్ jio.com లేదా మైజియో యాప్‌లోకి వెళ్లాలి.

జియో ఫోన్ 2 సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.
ప్రొసీడ్ టు చెక్ ఔట్ బటన్ క్లిక్ చేయాలి.
పేరు, ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రూ.2999 చెల్లించాలి.
కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇ-మెయిల్‌కు కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది.

జియో ఫోన్ 2 స్పెసిఫికేషన్స్

  • డిస్‌‌ప్లే: 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
  • ర్యామ్: 512 ర్యామ్
  • ఇంటర్నల్ స్టోరేజ్: 4జీబీ
  • రియర్ కెమెరా: 2 మెగా పిక్సెల్
  • ఫ్రంట్ కెమెరా: వీజీఏ
  • బ్యాటరీ: 2000 ఎంఏహెచ్
  • ఓఎస్: కేఏఐఓఎస్
  • సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
  • ధర: రూ.2,999

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+