సీనియర్ సిటిజెన్లకు జెట్ ఎయిర్వేస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

By Bharath Kumar
Subscribe to GoodReturns Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    సీనియర్ పౌరులకు జెట్ ఎయిర్వేస్ విమాన టిక్కెట్లపై 8 శాతం ప్రత్యేకమైన డిస్కౌంట్ను అందిస్తోంది. ఆఫర్ పొందేందుకు వినియోగదారులు ఎయిర్లైన్స్ యొక్క అధికారిక వెబ్ సైట్-jet airways.com, మొబైల్ యాప్ ను సంప్రదించగలరు.

    టికెట్ బుకింగ్ కొరకు:

    టికెట్ బుకింగ్ కొరకు:

    ఎయిర్ పోర్ట్ టికెట్ కార్యాలయాలు, సిటీ టికెటింగ్ కార్యాలయాలు అలాగే సంప్రదింపు కేంద్రాల లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ దేశం లోని అన్ని ఎయిర్లైన్స్ సంస్థల్లో వర్తిస్తుంది. ఈ పథకం 60 ఏళ్లు మరియు అంతకు పైబడిన సీనియర్ పౌరులకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కింద, టిక్కెట్లను కనీసం 15 రోజులు ముందుగా కొనుగోలు చేయాలనీ జెట్ ఎయిర్వేస్ తెలిపింది.

    జెట్ ఎయిర్వేస్ ప్రకారం:

    జెట్ ఎయిర్వేస్ ప్రకారం:

    జెట్ ఎయిర్వేస్ ప్రకారం, ఇటువంటి ఆఫర్లను పరిమిత కాలం లో అందుబాటులో ఉంచింది.సాధారణ సామాను అనుమతులు వర్తిస్తాయి. వయస్సు రుజువుతో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఈ పథకం కింద ప్రయాణానికి తప్పనిసరి అంటున్నారు. ఈ గుర్తింపు రుజువు చెక్-ఇన్ మరియు బోర్డింగ్ గేట్ వద్ద అందించబడకపోతే బోర్డింగ్ నిరాకరించబడుతుంది. గెస్ట్ (లు) ప్రయాణం అంతటా గుర్తింపు రుజువు కలిగి ఉండాలని క్యారియర్ అన్నారు.

    జెట్ ఎయిర్వేస్ ప్రీమియం

    జెట్ ఎయిర్వేస్ ప్రీమియం

    దీనితో పాటు మరో ఆఫర్ జెట్ ఎయిర్వేస్ ప్రీమియం, ఎకానమీ క్లాస్లలో ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లలో 30 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. జెట్ ఎయిర్వేస్ 'గ్లోబల్ సేల్' సెప్టెంబర్ 7, 2018 వరకూ జరుగుతున్న బుకింగ్లకు చెల్లుతుంది. ఎయిర్లైన్స్ ప్రకారం డిస్కౌంట్ లో భాగంగా సుమారు 25 లక్షల సీట్లు అందుబాటులో ఉంచింది. దేశీయ రంగాల్లో, ఆఫర్ ప్రయాణ కాలం సెప్టెంబర్ 12, 2018 నుండి మొదలవుతుంది. అంతర్జాతీయ రంగాల్లో సెప్టెంబర్ 10, 2018 నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది.

    వివిధ మార్గాల్లో:

    వివిధ మార్గాల్లో:

    జెట్ ఎయిర్వేస్ ఇటీవల దేశీయ మార్గాల్లో కొత్త ప్రత్యక్ష విమానాలు ప్రకటించింది. విశాఖపట్నం నుంచి ఢిల్లీ, కోయంబత్తూరు, హైదరాబాద్, గౌహతి, ముంబై, న్యూఢిల్లీ, చండీగఢ్, కోల్కతా, చండీగఢ్, లక్నో మరియు బెంగళూరు వరకు నేరుగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టింది.

    Read more about: jet airways
    English summary

    Jet Airways Offers Discount To Senior Citizens On Flight Tickets

    Jet Airways is offering 8 per cent exclusive discount on flight tickets for senior citizens. Customers willing to avail the offer can book tickets on airline's official website- jetairways.com, mobile app, airport ticketing offices, city ticketing offices and contact centre
    Story first published: Friday, September 7, 2018, 9:44 [IST]
    Company Search
    Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
    Thousands of Goodreturn readers receive our evening newsletter.
    Have you subscribed?

    Find IFSC

    Get Latest News alerts from Telugu Goodreturns

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more