రోజురోజుకీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి, ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో భారతీయులంతా ఆందోళన చెందుతున్నారు. డాలర్ విలువ పెరిగిపోవడంతో పెట్రోల్ ధర కూడా పైపైకి పోతూ, వాహనదారులకు చుక్కులు చూపిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ రేట్ పడిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులకు ధర కూడా పడిపోయింది. రూపాయి విలువ పడిపోవడంపూ దేశమంతా ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రవాసీయులు మాత్రం ఫుల్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 71.95 పైసలకి పడిపోయింది. ఇది రికార్డ్ స్థాయి పతనం. అయితే ఈ పరిణామంతో ప్రవాస భారతీయులు అందుకునే జీతంలో మార్పు లేకపోయినా, వారి ముఖాల్లో మాత్రం సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. కారణం మనీ ఎక్స్‌ఛేంజ్‌లో డాలర్లకి బదులుగా ఇచ్చే భారత కరెన్సీ ఎక్కువగా వస్తుండడమే. ఇంతకుముందు 100 డాలర్లు మార్చుకుంటే 6500 నుంచి 6700 మధ్య భారతీయ రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అది 7100 దాకా ఉంటోంది. దాంతో ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు పంపేందుకు వీలు కలుగుతోంది. డాలర్ పతనంతో కొద్దో గొప్పో సంపాదిస్తున్న వారు కూడా సంతోషంగా ఆ మొత్తాన్ని స్వదేశానికి పంపించడానికి క్యూ కడుతున్నారు. దీంతో విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న మనీ ఎక్స్‌ఛేంజ్‌లు కిటకిటలాడుతున్నాయి.
దుబాయి, కువైట్, మస్కట్, దమ్మాం ప్రాంతాల్లోని మనీ ఎక్స్‌ఛేంజ్ ఆఫీసులన్నీ ప్రవాస భారతీయులతో నిండిపోతున్నాయి. మరికొందరైతే రూపాయి మరింత బలహీనపడితే ఇంకా ఎక్కువ డబ్బు స్వదేశానికి పంపించవచ్చనే ఆలోచనల్లో ఉన్నారుట
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications