దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో రికార్డును నమోదు చేసింది. తాజాగా టీసీఎస్ మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్ల స్థాయిని దాటేసింది. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ ఇదే.

బిఎస్ఈ
మంగళవారం బిఎస్ఈ అంతర్గత ట్రేడింగ్ ట్రేడింగ్‌లో టీసీఎస్ షేర్ ధర ఒక దశలో 2.19 శాతం బలపడి రూ.2,100 స్థాయి వద్ద 52 వారాల సరి కొత్త గరిష్ఠ రికార్డు నమోదు చేసుకుంది. చివర్లో 1.86 శాతం లాభంతో రూ.2,093.20 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజే రూ.14,644.36 కోట్ల మేరకు పెరిగి రూ.8,01,397.36 కోట్లకు చేరుకున్నది.

టీసీఎస్
ప్రస్తుతం టీసీఎస్ దేశంలో అత్యంత విలువైన కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8 లక్షల కోట్లకు చేరిన తొలి కంపెనీగా గత నెల 23న రికార్డును నమోదు చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆ తర్వాత కాలంలో షేరు ధర కాస్త తగ్గడంతో మార్కెట్ విలువ రూ.7,87,357.93 కోట్లుగా నమోదైంది. 2018లో ఇప్పటివరకు బీఎస్ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 13.5 శాతం పెరగగా, టీసీఎస్ షేర్ల ధర సుమారు 54.6 శాతం వృద్ధి చెందింది.

సాఫ్ట్‌వేర్ కంపెనీ
సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల రాబడిలో మెజారిటీ వాటా విదేశాలు, అందునా అమెరికా మార్కెట్ నుంచే సమకూరుతుంది. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ క్రమంగా బలపడుతూ వస్తుండటం సాఫ్ట్‌వేర్ సంస్థలతోపాటు ఎగుమతుల ఆధారిత కంపెనీలన్నీ ఆదాయపరంగా కలిసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో టిసిఎ్‌సతో పాటు మిగతా ఐటి కంపెనీల షేర్లన్నీ దూకుడుగా ఉన్నాయి.

ప్రాజెక్టులు
అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ సేవలకు డిమాండ్ మళ్లీ పుంజుకుంటోంది. భారీ స్థాయి, క్లిష్టమైన, మిషన్ కీలక ప్రాజెక్టుల అమలులో మిగతా ఐటీ కంపెనీల కంటే అధిక అనుభవమున్న టీసీఎస్ మరిన్ని ప్రాజెక్టులు దక్కించుకోవటంతో పాటు రాబడులను పెంచుకోనుందనేది విశ్లేషకుల అంచనా.

గురువారం
ఈ నెల 6 (గురువారం) నుంచి ప్రారంభం కానున్న టీసీఎస్ షేర్ల బైబ్యాక్ (తిరిగి కొనుగోలు) 21న ముగియనున్నది. ఇందులో భాగంగా సంస్థ ఈక్విటీ వాటాదారుల నుంచి రూ.16వేల కోట్ల విలువైన 7.619 కోట్ల షేర్లు కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్‌కు రూ.2,100 చెల్లించనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది.

షేర్‌హోల్డర్ల
కంపెనీ వద్దనున్న నగదు నిల్వలను వాటా దారులకు పంచడంతో పాటు దీర్ఘకాలంలో షేర్‌హోల్డర్ల పెట్టుబడి విలువను పెంచే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రక్రియను చేపట్టింది. టీసీఎస్ బైబ్యాక్ ప్రకటించడం వరుసగా ఇది రెండో ఏడాది. గత సంవత్సరం కూడా సంస్థ రూ.16 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications