సౌత్ లో సూపర్ స్టార్ గా పేరున్న స్టార్స్ కి ఎంత క్రేజుందో రజనీకాంత్, మహేష్ బాబుని చూస్తుంటే తెలుస్తుంది. రజనికి ఉన్న అభిమానగణం, మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మహేష్ బాబు కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసినప్పటికీ ఇండియా వైడ్ గా బోలెడంత క్రేజుంది.

బ్రాండ్స్
అందుకే బోలెడన్ని బ్రాండ్స్ మహేష్ చేతిలో ఉన్నాయి. సినిమాలతోనూ, కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. మహేష్ సినిమాలు ప్లాప్ అయినా.. ఆయన తరవాతి సినిమాకి ఉండే ఎంత క్రేజ్ కొలమానంలో కొలవడం కష్టమనేంత ఉంటుంది. ఇక సినిమాల్లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే మహేష్ బ్రాండ్ మీద కూడా బోలెడంత సంపాదిస్తున్నాడు.

ఫిలిం సర్కిల్స్
అయితే మహేష్ రెమ్యునరేషన్, బ్రాండ్స్ కమిట్మెంట్ అన్ని మహేష్ భార్య నమ్రతానే చూసుకుంటుంది. తాజాగా మహేష్ బాబు వ్యాపారంలోకి అడుగెట్టబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది.

అమరావతి
అందులో భాగంగానే ఇంతకుముందే మహేష్ బాబు అమరావతి, వైజాగ్ లలో కొంత భూమిని కొనుగోలు చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు ఇప్పుడు మల్టిప్లెక్స్ రంగంలోకి కూడా మహేష్ అడుగుపెట్టబోతున్నాడట.

ప్రభాస్
మొన్నటికి మొన్న ప్రభాస్ నెల్లూరు దగ్గరలో మల్టిప్లెక్స్ ని ఆయన ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ తో కలిసి కడుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్మాత సురేష్ బాబు తో కలిసి మల్టిప్లెక్స్ ని విజయవాడ, తిరుపతి, వైజాగ్ లలో కట్టబోతున్నట్టుగా ప్రచారం జరిగింది

మల్టిప్లెక్స్
ఇక తాజాగా మహేష్ కూడా ఈ మల్టిప్లెక్స్ రంగంలోకి రాబోతున్నట్టుగా చెబుతున్నారు. ఏషియన్ ఫిలింస్ వారితో కలిసి మహేష్ బాబు ఈ మల్టిప్లెక్స్ రంగంలోకి రాబోతున్నాడట.

వ్యాపారంలో
అయితే ఒకచోట సక్సెస్ అయితే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహేష్, ఏషియన్ ఫిలింస్ వారు ముఖ్య పట్టణాల్లో ఈ మల్టిప్లెక్స్ లు నిర్మిస్తారని తెలుస్తుంది. మరి సినిమాలు, బ్రాండ్స్ తో బాగా సంపాదిస్తున్న మహేష్ ఇప్పుడు వ్యాపారంలోనూ దూసుకుపోతున్నాడు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications