ఇక నుంచి గ్యాస్ ధర రూ.1000 కేంద్రం ప్రజలపై మరో బాంబు!
ఎల్పీజీ సిలిండర్ ధర భగ్గుమంటోంది. రోజు రోజుకి పెరుగుతున్న ధరను చూసి సామాన్య ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.820కు పెరిగిపోయింది.

సిలిండర్
సమీప భవిష్యత్ లో ఇది రూ.1000 అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడే పెట్రోల్ అమ్దరియూ డీజీల్ ధరలు మరియు నిత్యావసరాల వస్తువులు ధరలు పెరిగుతున్నాయి కానీ ఇప్పుడు సబ్సిడీ లేని సిలిండర్ రేటు రూ.30.50 పెంచేశారు.

సబ్బిడీ
ఆగస్ట్ లో రూ.790 ఉండే నాన్ సబ్బిడీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.820.50 పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ అయిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో రెండు మూడు నెలల్లో సిలిండర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సబ్సిడీతో పొందే వినియోగదారులు మాత్రం రూ.503 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ రేటు బెంగళూరు వాసులకు మాత్రమే వర్తింస్తుంది. మిగిలిన ప్రాంతాలకూ కూడా పెద్దగా తేడా ఏమి లేదు.

బెంగళూరు
కేంద్ర ప్రభుత్వం పిలుపుతో నగరాల్లో కొందరు సలిండర్ సబ్సిడీ అక్కర్లేదని తిరిగి ఇచ్చేశారు. అందులో బెంగళూరు లాంటి నగరాల్లో 25 శాతం మంది సబ్సిడీని ప్రభుత్వానికి సరెండర్ చేశారని ఎల్పీజీ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ సంఘం తెలిపింది.

డెలివరీ బాయ్స్
వీటికి తోడు డెలివరీ బాయ్స్ సిలిండర్ కు అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ కు రూ.20 నుంటి రూ.30 వసూలు చేస్తున్నారు. ఏది ఏమైనా పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్ రేటు జనం గుండెల్లో గుబులురేపుతోంది.

మోడీ ప్రభుత్వం
అతి త్వరలో సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు చేరుకోనుందని అభిప్రాయం వెల్లడవుతోంది. జనానికి త్వరలో అచ్చేదిన్ అని చెబుతున్న మోడీ ప్రభుత్వం పెరుగుతున్న రేట్లతో ఏ విధంగా మంచి రోజులు తెస్తుందో అని ముక్కున వేలేసుకుని చూస్తున్నారు.

వంట గ్యాస్
నిన్న మొన్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నుంచి ప్రతి ఒకరి పైన భారం వేసిన మోడీ ప్రభుత్వం రేపు ఈ వంట గ్యాస్ పైన కూడా రేట్లు పెంచుతున్నారు చూడాలి ఇంకా ఎన్ని వాటిపైన రేట్లు పెంచి సామాన్యుడికి తూట్లు పెడతారో. కానీ పెంచిన పెట్రోల్ ధరలకు ఇప్పుడే ప్రజలు మండిపడుతున్నారు ఇక గ్యాస్ ధరలు పెంచుతే ఏమంటారో చూడాలి


Click it and Unblock the Notifications