ప్రపంచ కుబేరులలో చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీ బాబా గ్రూప్ అధినేత జాక్ మా ఒకరు.జాక్ మా ఇప్పుడు అలీబాబా వ్యవస్థపుకుడు కావచ్చు కానీ ఒకప్పుడు ఒక పేద ఉపాద్యాయుడు.

ఒక సాధారణ
1980 లో చైనాలో ఒక సాధారణ స్కూల్లో ఒక ఉపాద్యాయుడుగా జాక్ మా పని చేసాడు.కొద్దీ కాలం తర్వాత ఆ ఉపాద్యాయుడుగా ఉద్యోగం మానేసి ఒక అనువాద సంస్థ స్థాపించాడు.

వ్యాపార దిజగ్గం
బిల్ గేట్స్ , స్టీవ్ జాబ్స్ , ఇక ఇతర ధనవంతులు లాగా జాక్ మా గారికి కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. అయిన ఈయన తెలివితో ఇప్పుడు ప్రపంచంలో ఒక వ్యాపార దిజగ్గం లాగా నిలిచారు.

చిన్నప్పుడు
ఈయన చిన్నప్పుడు నుంచి చదువులో అంతా రాణించేవాడు కాదు. చిన్నతనంలో ఈయనకు లెక్కల పరీక్షలలో 120 మార్కులకి కేవలం 1 మార్కు వచ్చింది. ఈయన ఎంత అవమానం పడ్డారు అంటే కే ఎఫ్ సి సహా పలు కంపెనీ ఇంటర్వ్యూలు ఈయనని తిరస్కరించారు.

కంప్యూటర్
ఈయనకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎప్పుడూ తెలిసింది అంటే 1994 లో ఒకసారి అయన కంపెనీ పని మీద అమెరికాకు వెళ్లారు అక్కడే ఈయన కంప్యూటర్ గురించి తెలుసుకున్నాడు.ఇలా కంప్యూటర్ గురించి తెలుసుకున్న తర్వాత ఈయన స్నేహితులు అలీబాబా కంపెనీ పెట్టడానికి సహాయపడ్డారు.

నెంబర్ వన్
జాక్ మా 17 మంది తన స్నేహితులతో కలిసి 1997 లో ఫిబ్రవరి 21 న అలీబాబా కంపెనీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో స్థాపించారు. అదే కాక అలీబాబా కంపెనీ చైనాలో నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది

రికార్డు శాతంలో
2016 నవంబర్లో 9.3 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా, ఈ ఏడాది దానిని అధిగమించి 13.8 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.91 వేల కోట్లు) అమ్మకాలు జరిపి చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపు 56శాతం అధిక ఆదాయాన్ని ఆర్జించింది.

భారత మార్కెట్
అంతర్జాతీయ ఇ-కామర్స్ దిగ్గజాల దృష్టంతా భారత మార్కెట్ పైనే. దేశంలో ఇ-కామర్స్‌తోపాటు రిటైల్ వ్యాపారాలపై ప్రధానంగా కన్నేశాయి. అసలుకైతే, ఆలీబాబా రిలయన్స్ రిటైల్‌లో దాదాపు సగం వాటా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని, తాజాగా జాయింట్ వెంచర్ ఏర్పాటు దిశగా చర్చలు సాగుతున్న నేపథ్యంలో స్వల్ప వాటా దక్కవచ్చని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వ్యక్తులు తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు
ఇప్పుడు అలీబాబా మరియు రిలయన్స్ ఒప్పందం కుదురుతుంది అని అందరు అనుకుంటున్నారు. ఆలీబాబాకు ఇండియన్ మార్కెట్లో ఇదే అతిపెద్ద ఇన్వె్‌స్టమెంట్ కానుంది. భారత ఇ-కామర్స్ మార్కెట్లో అగ్రగామి సంస్థలుగా ఉన్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు గట్టిపోటీ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే దిశగా ఇరు వర్గాలు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆస్థి
ఇప్పుడు జాక్ మా గారి ఆస్థి ఎంత ఉంటుందో తెలుసా? అక్షరాలా 2 .43 లక్షల కోట్లకి అధిపతి అయ్యారు. దీని పట్టి అందరూ తెలుసుకోవలసింది కష్టపడితే తప్ప మనం మంచి స్థాయికి వెళ్లుచు అంతే తప్ప ఈజీ మనీ కోసం వెళ్ళితే బొక్క బోర్లా పడడం పక్క.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications