దూసుకుపోతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎన్ని రోజులో ఇలా?
సామాన్యుడి గుండెల్లో పెట్రో మంటలు మండుతున్నాయి కార్లు, బైక్‌లు బయటకు తీయాలంటేనే భయపడిపోయేలా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి దీని ప్రభావం వస్తురవాణా సేవలపై కూడా పడుతుండడంతో అక్రమంగా నిత్యావసరాల ధరలు కూడా ఆకాశంవైపు చూస్తున్నాయి.

వరుసగా
వరుసగా పెరుగతూ ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు ఈ రోజు అత్యధిక స్థాయిని తాకాయి. వరుసగా 10 రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రో ధరలు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా బెంబేలెతిస్తున్నాయి.

ఢిల్లీలో
ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .79.31కి చేరుకోగా వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల ధర రూ. 86.72కు, చెన్నైలో రూ. 82.41, కోల్‌కతాలో రూ. 82.22. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ కావాలంటే రూ.83.92 వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది

ముంబైలో
ఇక డీజిల్ విషయానికి వస్తే ముంబైలో లీటర్ డీజిల్ రూ. 75.74గా ఉండగా చెన్నైలో రూ.75.39, కోల్‌కతాలో రూ.74.19, హైదరాబాద్‌లో రూ.77.39గా ఉంది. ఈ రోజు లీటర్ పెట్రోల్‌పై 33 పైసలు, లీటర్ డీజిల్‌పై 42 పైసలు పెరగగా స్థానిక పన్నులను కలిపి వివిధ రాష్ట్రాల్లో వాటి ధరలు పెరిగాయి.

అత్యధికంగా
సవరించిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ ధర దేశంలో అత్యధికంగా ముంబైలో లీటర్‌కు రూ. 86.72గా ఉండగా లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా హైదరాబాద్‌లో రూ. 77.39గా ఉంది.

ధరల మంటలు
నిన్న కూడా ఇదే విధంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పరుగులు పెట్టాయి. దింతో ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఈ ధరల మంటలు చల్లారుతాయో తెలీక అంత అయ్యోమయంలో ఉన్నారు అంతే కాగా కేంద్ర ప్రభుత్వం పై అంత అసంతృప్తిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications