For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెటియం మరో అద్భుత ఆవిష్కరణకు తెర లేపింది.అదేంటో మిరే చూడండి.

One97 కమ్యునికేషన్స్ లిమిటెడ్ యొక్క పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన పెటియం మనీ లిమిటెడ్, గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్ మరియు ఆపిల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం iOS లో ప్రత్యేకమైన అప్లికేషన్న

|

One97 కమ్యునికేషన్స్ లిమిటెడ్ యొక్క పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన పెటియం మనీ లిమిటెడ్, గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్ మరియు ఆపిల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం iOS లో ప్రత్యేకమైన అప్లికేషన్ను ప్రవేశపెట్టింది, ఇది భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ బేస్ని వచ్చే ఐదు సంవత్సరాలలోపు 50 మిలియన్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ యాప్ ద్వారా:

ఈ యాప్ ద్వారా:

ఈ యాప్ ద్వారా వినియోగదారులు మ్యూచువల్ ఫండ్స్ కొనటానికి మరియు విక్రయించడానికి తమ మొబైల్ ఫోన్ నుండి సులువు పద్దతిలో నిర్వహించగలరని పేర్కొంది. పెట్టుబడిదారులు నేడే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రారంభించవచ్చని సంస్ధ తెలిపింది.

ప్రధాన దృష్టి

ప్రధాన దృష్టి

బెంగళూరుకు చెందిన సంస్థ పెటియం మనీ ప్రధానంగా పెట్టుబడుల అభివృద్ధి మరియు సంపద నిర్వహణ ఉత్పత్తులు మరియు సేవలను నిర్మిస్తుంది.పెటియం మనీ ద్వారా, మేము మిలియన్ల మంది భారతీయులకు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ప్రజాస్వామ్యీకరణ చేయాలని కోరుకుంటున్నాం అని పెటియం వ్యవస్థాపకుడు మరియు CEO అయిన విజయ్ శేఖర్ శర్మ ఒక ప్రకటనలో చెప్పారు.వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో మ్యూచ్యువల్ ఫండ్ పెట్టుబడిదారుల స్థాపన 50 మిలియన్లకు చేరుకుంటుందని ఆయన చెప్పారు.

డైరెక్టరు ప్రవీణ్ జాదవ్:

డైరెక్టరు ప్రవీణ్ జాదవ్:

పెటియం మనీ ప్రధాన డైరెక్టరు ప్రవీణ్ జాదవ్ మాట్లాడుతూ టెక్నాలజీ ఆధారిత ప్లాట్ఫారమ్ను కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇది వినియోగదారుడు తీసుకునే ఏ పెట్టుబడి నిర్ణయానికయినా ముందు సాధ్యమైనంతవరకు దానికి సంబందించిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది అని ఆయన చెప్పారు.

పెటియం మనీ ఇప్పటికే:

పెటియం మనీ ఇప్పటికే:

పెటియం మనీ ఇప్పటికే 8.50 లక్షల మందికి పైగా వినియోగదారుని ఆసక్తిని కలిగి ఉంది. మొబైల్ పరికరాల నుండి 96% కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయగా, సంస్థ దాని ప్రారంభ దశలో యాప్ విధానాన్ని మాత్రమే ఎంచుకుంది.

నియోగదారులకు యాక్సెస్:

నియోగదారులకు యాక్సెస్:

రోజుకు 2,500 కన్నా ఎక్కువ వినియోగదారులకు యాక్సెస్ ను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది మరియు అలాగే రానున్న కొన్ని వారాల్లో రోజుకు 10,000 మందికి పైగా వినియోగదారులకు ఇది పెరుగుతుంది అని పేర్కొంది.ప్రస్తుతం, పెటియం కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే విక్రయిస్తుందని భవిష్యత్తులో ఇంకా ఏ ఇతర ఉత్పత్తులను విక్రయిస్తుందో అనే దానిపై వ్యాఖ్యానించడానికి జాదవ్ నిరాకరించారు.

Read more about: paytm
English summary

పెటియం మరో అద్భుత ఆవిష్కరణకు తెర లేపింది.అదేంటో మిరే చూడండి. | Paytm Money App For Mutual Funds Launched. A look At What’s On Offer

Paytm Money Limited, a wholly-owned subsidiary of One97 Communications Limited, introduced a dedicated app on Google’s Android platform and Apple’s mobile operating system iOS with the aim of doubling the mutual fund investor base in India to 50 million in the next next five years.
Story first published: Tuesday, September 4, 2018, 11:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X