పెట్రోల్ దెబ్బ సామాన్యుడు అబ్బా.. ఆకాశానికి తాకిన ధరలు రోజు ఇంతేనా !
చమురు కంపెనీలు రెచ్చిపోతున్నాయి. ప్రతి రోజు పెట్రోల ధరల పెరుగుతున్నాయి తప్ప తగ్గించే పరిస్థితి కనిపించడంలేదు. రోజువారీ ధరల మారే విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చమురు కంపెనీల ఆగడాలకు అంతేలేకుండా పోయింది ప్రజల మీద రోజు భారం వేస్తున్నాయి.

వరుసగా
వరుసగా కొద్దిరోజుల నుంచి ధరలు పెంచుతూ పోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యుల మీద పడి వారి నడ్డివిరుస్తున్నాయి. తాజాగా ఈ రోజు కూడా చమురు సంస్థలు పెట్రో ధరలను సవరించాయి. లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, లీటర్ డీజిల్‌పై 39 పైసలు వడ్డించాయి.

బండితో బయటకి
దీంతో పెట్రో రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొత్తంగా పెట్రో రేట్లు ఆల్‌టైం గరిష్టానికి చేరుకుని సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటకు తీయాలంటే బండితో బయటకి పోవాలి అంటే జనం భయపడిపోతున్నారు.

నిత్యవసరాలు:
పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.పెట్రోల్ ధరల పెరగడం వల్ల సరుకు రవాణా మరింత ప్రియం అవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ భారమంతా మళ్లీ సామాన్యుల మీద అదేనండి వినియోగదారులే మోయాల్సిన పరిస్థితి.

హైదరాబాద్‌లో
సామాన్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్రో ధరలను భరించాల్సిన దుస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.98 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ. 77.45 పైసలకు చేరుకుంది. కొద్దిరోజులుగా పెట్రో ధరలు పెరుతుండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ రేట్లు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీలో
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 79,15కు చేరగా అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 71.15కు పెరిగింది. స్థానిక పన్ను కారణంగా, పెట్రోల్ మరియు డీజిల్ ధర ప్రతి రాష్ట్రంలో భిన్నంగా ఉండే విషయం తెలిసిందే.

ముంబై
ఇక ముంబై విషయానికి వస్తే దేశంలో గరిష్టంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 86.56కు పెరగగా లీటర్ డీజిల్ ధర రూ. 75.54కు చేరుకుంది. ఇక బెంగుళూరు విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.81 .12 కు పెరిగింది మరియు డీజిల్ ధర రూ.73 .15 కు పెరిగింది.

ప్రజలు ఆందోళన
ఇక మిగతా నగరాలలో కూడా పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఆకాశానికి తాకి ప్రజల రక్తం తాగుతున్నాయి. ఇకనైనా కేంద్రం దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోని ప్రజల మీద భారం తగ్గించేలాగా చూసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. చూద్దాం దీనికి కేంద్రం ఇలా స్పందిస్తుందో.


Click it and Unblock the Notifications