మొబైల్ అనేది ప్రపంచాన్ని ఏలుతున్న తరుణంలో దాని మీద అనేక పనులు జరుగుతున్నాయి. అలాంటి మొబైల్ మన నుంచి చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.

మొబైల్ ఇన్సూరెన్స్
ముఖ్య సమాచారాన్ని కోల్పోవడమే కాకుండా పాస్‌వర్డ్‌లు వంటి వాటిపట్ల ఆందోళన మొదలై చివరకు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎంతో ఖర్చు పెట్టిన మొబైల్ పోయిన సందర్భంలో ఆ ఫోన్ కొన్న మొత్తంలో చేతికి కొంత మొత్తం వస్తే చాలా సంతోషపడతాం. మరి అలా అమౌంట్ వచ్చే అవకాశం ఉందా దీనికి సమాధానమే మొబైల్ ఇన్సూరెన్స్ బీమా వర్తింపు, క్లెయిం లాంటి విషయాలు. వాటి గురించి తెలుసుకుందాం.

బీమా వర్తింపు:
అగ్ని ప్రమాదాలు, అల్లర్లు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు, ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు, నీళ్లలో పడి మొబైల్ పాడైనప్పుడు మరికొన్ని సందర్భాల్లో మాత్రమే బీమా వర్తిస్తుంది.

బీమా వీటికి వర్తించదు:
అనుమానాస్పద స్థితిలో, దేశం వెలుపల మొబైల్ పోగొట్టుకున్నప్పుడు, మరో వ్యక్తి ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్ పాడైనా లేదా పోయినా, సర్వీస్ సెంటర్ వద్ద కాకుండా వేరే ఎక్కడైనా మరమ్మతు చేయించినప్పుడు, అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన సమయంలో జరిగే నష్టానికి బీమా వర్తింపు ఉండదు.

క్లెయింకోసం కావాల్సిన పత్రాలు:
క్లెయిం ఫారం, మొబైల్ కొనుగోలు బిల్లు, క్లెయిం వివరాలను తెలియపరిచేందుకు అక్‌నాలెడ్జ్‌మెంట్, మొబైల్ దొంగతనానికి సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు కాపీ, లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీ, బీమా కంపెనీ అడిగిన విధంగా మొబైల్ గుర్తించబడలేదని నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది

ప్రమాదానికి గురై మొబైల్ పాడైపోయినప్పుడు:
క్లెయిం ఫారం, మొబైల్ కొనుగోలు బిల్లు,క్లెయిం వివరాలను తెలియపరిచేందుకు అక్‌నాలెడ్జ్‌మెంట్, ప్రమాదానికి గురైన ఫోన్ స్క్రీన్ ఫోటోతో పాటు ఐఎమ్‌ఈఐ నంబరుతో కూడిన ఫొటో, స్వర్వీస్ సెంటర్ అందించే మరమ్మతు ఖర్చుల అంచనా పత్రం, రీప్లేస్‌మెంట్ బిల్లు లేదా నష్టపోయినట్లు ఇచ్చే సర్టిఫికెట్‌తో పాటు బిల్లు, మరమ్మతు రీప్లేస్‌మెంట్‌కు సంబంధించిన బిల్లు, క్లెయిం సొమ్ముకు సంబంధించిన సర్వే నివేదికలు అవసరమవుతాయి.

మొబైల్ పోతే చేయాల్సిన పనులు:
మొబైల్ ఫోన్ పోయినట్లుగా గుర్తించిన వెంటనే 24 గంటల్లోగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 48 గంటల్లోగా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. క్లెయిం పొందేందుకు బీమా కంపెనీ సూచించిన విధంగా పాటించాలి.

ఎంత మొత్తం వస్తుంది:
ప్రీమియం: రూ. 5000 కన్నా తక్కువ ఖరీదు కలిగిన మొబైల్ ఫోన్లకు రూ. 299 నుంచి రూ. 600 వరకూ, రూ. 5000 నుంచి రూ. 15000 లోపు వాటికి రూ. 500 నుంచి రూ. 1300 వరకూ ప్రీమియం ఉంటుంది.రూ. 15000 నుంచి రూ. 25000 లోపు వాటికి రూ. 1200 నుంచి రూ. 2000 వరకూ ప్రీమియం ఉంటుంది. ఇంకా ఖరీదైన ఫోన్లకు పాలసీ వర్తింపును బట్టి రూ. 2000 నుంచి రూ. 5000 వరకూ ప్రీమియం ఉంటుంది.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications