ఇండిగో విమాన టికెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది.
బడ్జెట్ క్యారియర్ ఇండిగో మొత్తం డిస్కౌంట్ తో కలిపిన విమాన టిక్కెట్లను రూ .999 రూపాయలకే విక్రయిస్తోంది.
బడ్జెట్ క్యారియర్ ఇండిగో మొత్తం డిస్కౌంట్ తో కలిపిన విమాన టిక్కెట్లను రూ .999 రూపాయలకే విక్రయిస్తోంది. నాలుగు రోజుల విక్రయం కొనసాగనుంది వచ్చే సెప్టెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చ్ 30 వరకు ప్రయాణానికి సెప్టెంబర్ 6 లోగ టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.

ఇండిగో ఈ ఆఫర్ కింద ఒక మిలియన్ సీట్లు అందిస్తోంది. దేశీయ విమానాలు రూ .999 రూపాయల నుండి ప్రారంభం కాగా, అంతర్జాతీయ విమానాల ప్రయాణాలకు రూ .3,199 వద్ద బుక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా, ఇండిగో వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా MobiKwik వాలెట్ ద్వారా చెల్లించినప్పుడు,20 శాతం వరకు అంటే సుమారు 600 రూపాయలు విలువైన సూపర్ క్యాష్ ను పొందవచ్చు. సెప్టెంబరు 3 నుంచి సెప్టెంబరు 6, 2018 వరకు ఈ నాలుగు రోజుల పండుగ విక్రయాలను ప్రకటించామని సంస్థ పేర్కొంది ఇందుకు తాము చాల హర్షిస్తునాం అని కూడా అన్నారు.
కస్టమర్లు కచ్చితంగా అందుబాటులో ఉన్న అతి తక్కువ ధరలకే లభిస్తున్న సీట్లన్నీ బుక్ చేసుకుంటారని మాకు దృఢ నమ్మకం ఉందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టేర్ అన్నారు.
చాల నెలల తరువాత ఇండిగో సంస్థ మిలియన్ సీట్లను అందించడం ఇది రెండవసారి అని అన్నారు.0 బడ్జెట్ క్యారియర్ ఇండిగో రోజుకు 1,100 విమానాలను 52 గమ్యస్థానాలకు నిర్వహిస్తోంది, ఇందులో ఎనిమిది అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇది 160 విమానాల సముదాయం కలిగి ఉంది.


Click it and Unblock the Notifications