For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేకింగ్ న్యూస్ మన కరెన్సీ నోట్ల ద్వారా రోగాలు వస్తున్నాయి? కేంద్రం సంచలన ప్రకటన!

By Sabari
|

కరెన్సీ నోట్లు రోగాలను వ్యాప్తి చేస్తున్నాయన్న కలవరం మొదలైంది. దీనిపై దర్యాప్తు చేయాలంటూ ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకే లేఖ రావడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది.

 బీరువాలో

బీరువాలో

మీ ఇంట్లో బీరువాలో నోట్ల కట్టలు ఉన్నాయా? డబ్బు బాగానే సంపాదించేశామని సంబరపడిపోతున్నారా? అయితే ఈ కరెన్సీ నోట్లే మీకు రోగాలను అంటించగలవు జాగ్రత్త. కరెన్సీ నోట్లేంటీ రోగాలు అంటించడమేంటీ అనుకుంటున్నారా? ఇప్పుడు తాజాగా కలవరపరుస్తున్న విషయమిదే.

 అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

దీనిపైనే అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతే కాదు దీనిపై దర్యాప్తు చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది సీఏఐటీ. ఆ లేఖ కాపీలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్‌లకు పంపింది.

నోట్లతో రోగాలొస్తాయా?

నోట్లతో రోగాలొస్తాయా?

కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయన్న ఆందోళనకు కారణం మీడియాలో అధ్యయనాలు, మీడియాలో వస్తున్న వార్తలే. కరెన్సీ నోట్ల కారణంగా చర్మవ్యాధులు, నోటి, జీర్ణాశయ సమస్యలు, మూత్రకోశ, శ్వాసకోశ రోగాలు సంక్రమిస్తున్నాయన్నది సీఏఐటీ వాదన.

సామాన్య ప్రజలకు

సామాన్య ప్రజలకు

కొన్ని అధ్యయనాలు ఇదే రుజువు చేశాయని వర్తకుల సమాఖ్య వాదిస్తోంది. అయితే వ్యాపారులు, వర్తకులే కరెన్సీ నోట్లను ఎక్కువగా వాడుతుంటారు. దీంతో సీఐఏటీ రంగంలోకి దిగింది. సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది అని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సైన్స్ పత్రికలు

సైన్స్ పత్రికలు

సైన్స్ పత్రికలు ఏటేటా ఇలాంటి కథనాలను ప్రచురిస్తుంటాయి. హెచ్చరికల్ని చేస్తుంటాయి. తీవ్రమైన ప్రజారోగ్య సమస్యపై ఎలాంటి విచారణ జరపకపోవడం విచారకరం. వర్తకులు, వ్యాపారులు కరెన్సీ నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఆ కథనాల్లో నిజం ఉంటే వ్యాపారులు మాత్రమే కాదు వినియోగదారులకూ ఇబ్బందులు తప్పవు.

Read more about: currency
English summary

బ్రేకింగ్ న్యూస్ మన కరెన్సీ నోట్ల ద్వారా రోగాలు వస్తున్నాయి? కేంద్రం సంచలన ప్రకటన! | Do Currency Spread Diseases

కరెన్సీ నోట్లు రోగాలను వ్యాప్తి చేస్తున్నాయన్న కలవరం మొదలైంది. దీనిపై దర్యాప్తు చేయాలంటూ ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకే లేఖ రావడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది.
Story first published: Monday, September 3, 2018, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X