మీకు SBI అకౌంట్ ఉందా? అయితే మీకు చేదు వార్త!
ఎస్‌బీఐ శాఖల హేతుబద్దీకరణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా 1295 పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను మార్చేసింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఎస్‌బీఐ వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. ఎస్బీఐలో 6 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో అతిపెద్ద బ్యాంకుగాను, ప్రపంచవ్యాప్తంగా 53వ అతిపెద్ద బ్యాంకుగాను అవతరించింది. జూన్ 30, 2018 నాటికి ఎస్‌బీఐ వద్ద 33.45 లక్షల కోట్ల ఆస్తులున్నాయి.
ఇప్పుడు ఎస్బీఐ ఖాతాదారులకు ఒక చేదు వార్త మొత్తం రుణాల మీద వడ్డీ రేట్లు పెంచుతూ ఒక వార్త విడుదల చేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణాలపై వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల రుణాలపై స్టాండర్డ్ గా 0.2 శాతం వడ్డీ రేట్లు పెంచింది. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ, వాహన, రుణాలు, రీటెయిల్ట్ పర్సనల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి. కాల పరిమితి మూడేళ్ల వరకు గల అన్ని రుణాలపైనా 0.2 శాతం వడ్డీ రేటు పెంచారు. ఫలితంగా నెల పరిమితి గల రుణాలపై వడ్డీరేటు 7.9 నుంచి 8.1కి పెరగగా, ఏడాది రుణాలపై 8.25 నుంచి 8.45 కి పెరుగుతుంది. పర్సనల్ లోన్లన్నింటికి కూడా ఏడాది స్లాబే వర్తిస్తుంది. అలాగే మూడేళ్ల పరిమితి గల రుణాలపై వడ్డీరేటు 8.45 నుంచి 8.65 కి పెరుగుతుంది. ఇక రుణాలపై పెరిగిన వడ్డీరేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తున్నాయి.
అయితే ఈ వడ్డీరేట్లు మరింతగా పెరిగే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా వృద్ధి రేటు 8 శాతానికి పైగా నమోదైనా రూపాయి విలువ అనూహ్యంగా పడిపోతున్న కారణంగా గ్రోత్ రేటు 7.5 కు పడిపోయే ప్రమాదముందంటున్నారు నిపుణులు. ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు ఎస్బీఐ ముందుగానే మరోసారి వడ్డీరేట్లు పెంచవచ్చంటున్నారు.


Click it and Unblock the Notifications