ఆకాశానికి తాకిన పెట్రోల్ మరియు డీజీల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మరోసారి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనమవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరిన డీజిల్ ధర.. నేడు మరింత పెరిగింది. పెట్రోల్ ధరలు సైతం నేడు ఆల్ టైం గరిష్ఠానికి చేరాయి.

మేలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 80.42 డాలర్లు పలకడంతో దేశీయంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. మే 29న దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.43గా ఉంది. ఇది ఢిల్లీలో ఆల్ టైం రికార్డు. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర రూ.78.68 గా ఉంది. ముంబైలో రూ. 86.09, కోల్‌కతాల రూ.81.60, చెన్నైలో రూ.81.72, హైదరాబాద్‌లో 83.30 గా ఉంది.
ఇక డీజిల్ ధరల విషయానికొస్తే.. ముంబై రూ. 74.76, కోల్‌కతాలో రూ. 73.27, చెన్నైలో రూ. 74.39, హైదరాబాద్‌లో 76.42గా ఉంది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications