కేరళకు కేంద్రం ఇచ్చిన డబ్బు తో పోలిస్తే ప్రజలు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా?

శతాబ్ద కాలంలో ఎప్పుడు లేని విదంగా అత్యంత తీవ్రమైన వరదలు చూసిన తరువాత తమ జీవితాలను పునర్నిర్మించుకోడానికి ప్రయత్నిస్తున్న కేరళ నివాసితులకు సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రజలు గత కొద్ది రోజులలో

శతాబ్ద కాలంలో ఎప్పుడు లేని విదంగా అత్యంత తీవ్రమైన వరదలు చూసిన తరువాత తమ జీవితాలను పునర్నిర్మించుకోడానికి ప్రయత్నిస్తున్న కేరళ నివాసితులకు సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రజలు గత కొద్ది రోజులలో ముందుకు వచ్చారు. ఆహారం, మందులు, బట్టలు మరియు డబ్బు - అన్ని రకాలలో సహాయం అందించారు.

ప్రస్తుత రోజుల్లో:

ప్రస్తుత రోజుల్లో:

ప్రస్తుతం రోజుల్లో మనం ఎవడిగ్గరికైనా వెళ్లి సహాయం కోరితే నువ్వు ఎవరు అసలు నేనెందుకు నీకు సహాయం చేయాలి అని ప్రశ్నించే రోజులివి.కానీ ఏ సంబంధం లేకుండా మనిషికి మనిషి సహాయం చేసుకోవడం అంటే ఇదేనేమో.మీరు విన్నది నిజమే మొన్న కేరళలో వరదలు వచ్చి తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు మేమున్నాం అని దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

ఆపన్న హస్తం:

ఆపన్న హస్తం:

తీవ్ర వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ సేవలు అందించాయి ప్రజలు ఇతర రాష్ట్రాల నుండి ఎవరికీ తోచింది వారు పలు రకాలుగా ప్రజలకు వుపయోగపడే వస్తువులను అందిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు.ఆపద ఎవరికైనా రావచ్చు ఈరోజు కేరళకు వచ్చింది రేపు మనకు రాదనే నమ్మకం ఏంటి అనే ఆలోచనతో ప్రజలు పెద్ద ఎత్తున సహాయం చేసారు.

ప్రముఖ వ్యక్తులు:

ప్రముఖ వ్యక్తులు:

ఈ విపత్తు నేపథ్యంలో అనేకమంది ప్రముఖ వ్యక్తులు,పారిశ్రామిక వెతలు అలాగే సినీ ప్రముఖులు ఎంతో మంది ముందుకొచ్చారు.సినీ ప్రముఖులు ప్రాంతం అలాగే బాష తో పనిలేకుండా అన్ని సినీ రంగాల ప్రముఖులు కేరళకు సహాయం చేసేందుకు వచ్చారు.

కేరళ ముఖ్యమంత్రి:

కేరళ ముఖ్యమంత్రి:

కేరళ అపార వరదల వల్ల సుమారు 231 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. వరదలు నేపథ్యంలో కేరళకు 2,600 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కోరుతూ కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేక రాసింది.రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పునరాయ్ దీనికి సంబంధించి తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.మరియు దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని కూడా కోరింది.

కేంద్ర సహాయం:

కేంద్ర సహాయం:

కేంద్ర ప్రభుత్వం కేరళ విపత్తును మొత్తం పరిశీలించి మొదట రూ.100 కోట్లు ఇచ్చి తరువాత వెంటనే రూ.600 కోట్లు విడుదల చేసింది ఐతే తాము అడిగిన దానితో పోలిస్తే కేంద్రం ఇచ్చింది చాల తక్కువ అని కేరళ ప్రభుత్వం కేంద్రం పై మండి పడింది.ఇదిలా ఉండగా పలు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ కేంద్రానికి అనుకూలంగా లేని రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని వ్యాఖ్యానించారు.

ప్రజల సహాయం:

ప్రజల సహాయం:

ఎటువంటి సంబంధం లేకుండా దేశ ప్రజలు కేరళకు ఇప్పటిదాకా సుమారు రూ.1000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించ్చారు.కొన్ని లక్షల మంది ప్రజలు మేమున్నాం అంటూ ముందుకొచ్చి కేరళకు గట్టిగా నిలబడ్డరు.కేరళ ప్రభుత్వం ఈ తాజా సొమ్ము విలువ మీడియా కు వెల్లడించింది.ఐతే కేంద్రం ఇచ్చిన దానితో పోల్చి చూస్తే సుమారు 30 శతం డబ్బు అదనంగా దేశ ప్రజలు ఇచ్చారు అన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు.

పేరుపేరునా కృతజ్ఞేతలు:

పేరుపేరునా కృతజ్ఞేతలు:

లక్షల మంది కేరళను ఆదుకున్నారు,ఎంతోమంది తమకు తోచినంత సొమ్ము ముఖ్యమంత్రి సహాయ నిధికి అందింస్తున్నారు అందులో చిన్న మొత్తం నుండి పెద్ద మొత్తాల్లో కూడా సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కేరళ ప్రభుత్వం తమ కృతజ్ఞేతలు తెలియజేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+