మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు 'ఎగిరిపోతే ఎంత బావుంటుందీ' అని పాటలు పాడుకున్నారా? వెంటనే ఏ ఫ్లైటో వచ్చి మీకు లిఫ్ట్ ఇస్తే బాగుండునని కలలు కన్నారా? త్వరలో ఇవన్నీ నిజం కాబోతున్నాయి.

ఊబెర్ ఫ్లయింగ్ క్యాబ్
అవును ఇది అక్షరాలా నిజం. ఎక్కడికైనా త్వరగా వెళ్లాలంటే ఊబెర్ క్యాబ్ బుక్ చేయడం మీకు అలవాటా? ఇంకా త్వరగా వెళ్లాలంటే మాత్రం ఊబెర్ ఫ్లయింగ్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. దర్జాగా మినీ ఫ్లైట్‌లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని రయ్యిమంటూ ఆకాశంలో వెళ్లొచ్చు.

లాంఛ్
మీ గమ్యానికి ఇంకా త్వరగా చేరుకోవచ్చు. ఇదంతా జరగడానికి ఎన్నో ఏళ్లు పట్టదు. త్వరలో ఇండియాలో ఊబెర్ ఫ్లయింగ్ క్యాబ్ సర్వీసులు ప్రారంభమయ్యేందుకు ముందడుగులు పడుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ కల నెరవేరే అవకాశముంది. ఫ్లయింగ్ క్యాబ్ సర్వీస్ లాంఛ్ చేయడానికి ఊబెర్ కంపెనీ ఐదు దేశాలను ఎంపిక చేసింది.

ఇండియాతో పాటు
అందులో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ప్రాన్స్, జపాన్ ఉన్నాయి. టోక్యోలో జరిగిన ఊబెర్ ఎలివేట్ ఆసియా పసిఫిక్ ఎక్స్‌పో లో ఈ ప్రకటన చేసింది కంపెనీ. ఇప్పటికే ఊబెర్ ఎలివేట్ అమెరికాలోని డల్లాస్, లాస్ ఏంజిల్స్‌ని ఎంపిక చేసింది కంపెనీ. ఎంపిక చేసిన ఐదు దేశాల నుంచి ఒక్కో నగరాన్ని సెలెక్ట్ చేస్తుంది ఊబెర్.

క్లిక్ చేస్తే
ఊబెర్ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే మీరు కూర్చున్న చోట ఓ క్లిక్ చేస్తే చాలు ఫ్లైట్ వచ్చి మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఆసియా పసిఫిక్ నగరాల్లో ఊబెర్ ఎయిర్ రూట్స్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో స్థానిక రవాణా వ్యవస్థకు ఎంత ఉపయోగపడ్తాయో వివరించింది కంపెనీ. అంతేకాదు ఊబెర్ ఈట్స్ తరఫున డ్రోన్ డెలివరీని ప్రయోగాత్మకంగా లాంఛ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.

బెంగళూరు
ఊబెర్ ఎలివేట్ ఆసియా పసిఫిక్ ఎక్స్‌పో తొలిసారి నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఊబెర్ ఎయిర్ కోసం ఐదు దేశాలను ఎంపికచేశాం. మా టెక్నాలజీతో కొత్త శిఖరాలను తాకుతున్నాం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు ప్రపంచంలోనే రద్దీగా ఉండే నగరాలు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాలంటేనే గంటల సమయం పడుతుంది. ఎంత రద్దీగా ఉన్నా వేగంగా గమ్యాన్ని చేరేందుకు ఊబెర్ ఎయిర్ ఎంతో ఉపయోగపడుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications