మోడీ విషయంలో ప్రతిపక్షాల మాట నిజమైందా? అందుకే ఇది అట్టర్ ప్లాప్!
నోట్ల రద్దు ఈ మాటని భారతీయులు అంత ఈజీగా మర్చిపోరేమో నోట్ల రద్దుతో నల్లధనం లేకుండా పోతుంది అంటూ 2016 నవంబరు 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేస్తున్నాం అని మోదీ ప్రకటించారు.

కష్టాలు పడ్డారు
ప్రజలు కూడా దేశానికి మంచి జరుగుతుందిగా అనుకున్నారు కానీ క్యూల్లో నిల్చొని కష్టాలు పడ్డారు ప్రతిపక్షాలు అయితే ఈ నోట్లరద్దు వల్ల ప్రజలు కష్టపడటం తప్ప పెద్ద ప్రయోజనం ఉండదని మొత్తుకున్నా ఆ మాటలు ఎవరూ పట్టించుకోలేదు.

మోదీనేమో
మోదీనేమో ఈ 50 రోజులు కష్టపడండి దేశం బాగుపడుతుంది.. మంచి జరుగుతుంది నల్ల డబ్బు, నకిలీ నోట్లు, ఉగ్రవాదం అన్నీ కంట్రోల్ అవుతాయి అన్నారు ప్రజలు నమ్మారు కానీ మోదీ చెప్పినట్టు జరగలేదు.

రిజర్వు బ్యాంకు
ప్రతిపక్షాలు చెప్పిందే నిజమైంది నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయింది రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లలో 99.3 శాతం తిరిగి తెల్లధనమై బ్యాంకులకు చేరింది రద్దయిన మొత్తం రూ.15.41 లక్షల కోట్లలో కనీసం ఐదు లక్షల కోట్ల నల్లధనం తేలుతుందని మోదీ సర్కారు భావించగా, కేవలం రూ.10,727 కోట్లు మాత్రమే బ్యాంకులకు చేరలేదని బుధవారం రిజర్వు బ్యాంకు ప్రకటించింది.

పెద్ద నోట్ల రద్దులో
కనీసం ఒక్క శాతం కూడా మిగల్లేదు కొత్త నోట్ల ముద్రణకు అయిన రూ.21 వేల కోట్ల ఖర్చులన్నా పెద్ద నోట్ల రద్దులో మిగల్లేదు ఇదికాక నోట్ల రద్దు తర్వాత ఏడాదిలో ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం రూ.2.25 లక్షల కోట్లని ఆర్థిక నిపుణులు తేల్చారు

ప్రజలు షాక్
దీంతో ప్రజలు షాక్ అవుతున్నారు ప్రతిపక్షాలు మేం చెప్పినట్టే జరిగిందని మండిపడుతున్నాయి చూస్తుంటే నోట్ల రద్దు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుందని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications