హెచ్1-బి వీసాల విషయంలో ప్రీమియం ప్రాసెసింగ్‌పై సస్పెన్షన్‌ను అమెరికా ప్రభుత్వం మరికొన్నాళ్లు పొడిగించింది. బ్యాక్‌లాగ్‌ల క్లియరింగ్ ప్రయత్నాల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ వీసాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మరికొన్నాళ్లు ఇబ్బందులు తప్పేలా లేవు. భారతీయ ఐటీ నిపుణులలో హెచ్1-బి వీసాలకు బాగా డిమాండు ఉంది. రూ. 86 వేల అదనపు ఫీజు కడితే సాధారణంగా ఆరు నెలలు పట్టే వీసా ప్రాసెసింగ్ సమయం 15 రోజులకు తగ్గిపోతుంది. ఫలితంగా వీసా త్వరగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈతరహా ప్రీమియం ప్రాసెసింగ్‌ను 2019 ఫిబ్రవరి వరకు సస్పెండ్ చేస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది.

సెప్టెంబరు 11వ తేదీ నుంచి ఈ తాజా సస్పెన్షన్ ప్రారంభమవుతుంది. 2007 నుంచి 2017 మధ్య కాలంలో నిపుణులైన భారతీయ ఐటీ ఇంజనీర్లకు చెందిన 22 లక్షల హెచ్1-బి పిటిషన్లు అందినట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. భారత్ తర్వాత అత్యధికంగా చైనా నుంచి 3 లక్షల హెచ్-1బి పిటిషన్లు అదే సమయంలో అందాయి. హెచ్-1బి నాన్ ఇమ్మిగ్రెంటు విభాగంలో వీసా పొందినవారు మూడేళ్లపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగిస్తారు
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications