స్థిరంగా ముగిసిన ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నా నిఫ్టి మాత్రం స్థిరంగా ముగిసింది. ఓపెనింగ్ లో కాస్త నష్టాల్లో ఉన్నా తరవాత కోలుకుని మిడ్ సెషన్ వరకు నిలకడగా ఉంది నిఫ్టి. వాస్తవానికి ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ తప్ప. మిడ్ సెషన్ తరవాత యూరో మార్కెట్లన్నీ రెడ్ లోకి మారాయి. పైగా కీలక మార్కెట్ల సూచీలు ఒక శాతం దాకా నష్టపోయాయి.

స్థిరంగా ముగిసిన ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్
అయితే మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ముగియడానికి ప్రధాన కారణం.. ఇవాళ ఆగస్టు నెల డెరివేటివ్స్ క్లోజింగ్ కావడమే. ఫార్మా, ఎఫ్ ఎంసీజీ రంగాల షేర్లకు గట్టి మద్దతు లభించింది. పీఎస్ యూ బ్యాంకులు కూడా నిలదొక్కుకోవడంతో నిఫ్టి కేవలం 15 పాయింట్ల నష్టంతో 11676 వద్ద ముగిసింది. లాభాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో సన్‌ ఫార్మా ముందుంది. ఈ షేర్ 3.3 శాతం లాభపడింది. గెయిల్ రెండున్నర శాతం లాభపడగా, టాటా స్టీల్, ఎన్ టీపీసీ, యూపీఎల్ కూడా రెండు శాతంపైగా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఐషర్ మోటార్స్ ముందుంది. ఈ షేర్ రెండు శాతం నష్టపోయింది. తరవాతి స్థానాల్లో బజాజ్ ఫైనాన్స్, హెచ్ పీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ ఉన్నాయి. ఇతర షేర్లలో జేపీ పవర్ 18.75 శాతం లాభపడగా, జే పీ అసోసియేట్స్ కూడా 5.86 శాతం లాభంతో ముగిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+