For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు లోన్ కావాలా? అయితే డోంట్ వర్రీ గూగుల్ ని అడగండి

By Sabari
|

ఆల్ఫబెట్ ఇంక్ గూగుల్ భారతీయ బ్యాంకులతో చేతులు కలుపుతోంది. ఇప్పటికే డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ప్రారంభించిన గూగుల్ కొత్త యూజర్లకు గాలమేసేందుకు డిజిటల్ లోన్స్‌ని తెరపైకి తీసుకొచ్చింది.

గూగుల్ వార్షిక

గూగుల్ వార్షిక

న్యూ ఢిల్లీలో జరిగిన గూగుల్ వార్షిక ఈవెంట్‌లో ఈ ప్రణాళికలు ప్రకటించారు. కోట్లాది మంది భారతీయులు తమ ప్లాట్‌ఫామ్ ద్వారా బ్యాంకు లావాదేవీలు దగ్గర చేయాలని భావిస్తోంది గూగుల్. గతేడాది గూగుల్ తేజ్ పేమెంట్స్ యాప్‌ని ప్రారంభించింది. ప్రతీ నెల 2.2 కోట్ల మంది తేజ్ యాప్ యాక్టీవ్ యూజర్లున్నారని గూగుల్ చెబుతోంది.

గూగుల్ పే

గూగుల్ పే

2023 నాటికి లక్ష కోట్ల డాలర్ల బిజినెస్ చేస్తుందని క్రెడిట్ సూసీ నివేదిక సారాంశం. పేమెంట్స్‌ యాప్ తేజ్‌ని 'గూగుల్ పే' పేరుతో రీబ్రాండ్ చేసింది గూగుల్. ఫెడరల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ పే ద్వారా యూజర్లకు ఈ బ్యాంకులు ఇన్‌స్టంట్ లోన్లు ఇస్తాయి.

 బ్యాంకులతో

బ్యాంకులతో

మేం చాలా బ్యాంకులతో మాట్లాడుతున్నాం. అన్ని బ్యాంకులతో పనిచేయడానికి సిద్ధం. బ్యాంకులు యూజర్లను, కస్టమర్లను అర్థం చేసుకొని ఆర్థిక తోడ్పాటు అందిస్తాయి. ఈ ప్రక్రియను సులభంగా, వేగంగా చేసేందుకు మేం ప్రయత్నిస్తాం అని గూగుల్ యాజమాన్యం చెప్పింది.

పేటీఎంకు

పేటీఎంకు

భారతీయ కంపెనీ అయిన పేటీఎంకు గట్టి పోటీ ఇవ్వాలన్నది గూగుల్ లక్ష్యం. మరోవైపు పేమెంట్స్ బ్యాంకు నడుపుతున్న పేటీఎం కూడా ఇన్సూరెన్స్, మ్యూచ్యువల్ ఫండ్స్‌తో తమ సేవల్ని విస్తరించే పనిలో ఉంది.

Read more about: loan
English summary

మీకు లోన్ కావాలా? అయితే డోంట్ వర్రీ గూగుల్ ని అడగండి | Google Offering Instant Loans

Alfabet Inc. Google adds hands to Indian banks. Google already launched digital payments services, bringing digital phones to the foreground to new users.
Story first published: Thursday, August 30, 2018, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X