For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక పై గూగుల్ తేజ్ యాప్ పేరు "గూగుల్ పే" దీనితో లోన్ కూడా వస్తుంది.

By Sabari
|

తేజ్ గూగుల్‌కు చెందిన యూపీఐ ఆధారిత పేమెంట్స్ యాప్ ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చేసే ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన యాప్ సులభమైంగా ఉండడంతో పాటు రివార్డ్ వోచర్స్‌తో అదనంగా డబ్బు పొందే అవకాశం ఉండడంతో అందరికీ చేరువైంది.

యాప్ పేరు

యాప్ పేరు

ఇప్పుడీ యాప్ పేరు మారిపోయింది. తేజ్ యాప్‌ను ఇకపై 'గూగుల్‌ పే'గా వ్యవహరించనున్నారు. ఢిల్లీలో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2018 కార్యక్రమంలో ఈ మేరకు గూగుల్ ప్రకటించింది. పేరు మార్పుతో పాటు అదనపు ఫీచర్లను కూడా జోడించింది.

త్వరలోనే

త్వరలోనే

త్వరలోనే అప్‌డేటెడ్ వర్షన్ తీసుకొస్తామని గూగుల్ ప్రతినిధులు చెప్పారు. తేజ్ పేరు మాత్రమే మారింది కానీ యాప్‌లో ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించారు. హోం స్క్రీన్ సహా ఏదీ మారలేదు. ఐతే వీటికి అదనంగా మరిన్ని ఆన్‌లైన్‌ పేమెంట్ల కోసం ఆన్‌లైన్, ఇన్‌స్టోర్వీ ఆప్షన్స్‌ను కొత్తగా జోడిస్తున్నారు.

ఇన్‌స్టంట్ లోన్స్‌కు

ఇన్‌స్టంట్ లోన్స్‌కు

ప్రధానంగా ఇన్‌స్టంట్ లోన్స్‌కు అప్లై చేసుకునే సదుపాయాన్ని యాప్‌లో పొందుపరుస్తున్నారు. అందుకోసం ICICI, HDFC, ఫెడరల్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి బ్యాంకులతో ఒప్పందం చేసుకోబోతున్నారు.

తొలి డిజిటల్ పేమెంట్

తొలి డిజిటల్ పేమెంట్

భారత్‌లో గూగుల్ ప్రవేశపెట్టిన తొలి డిజిటల్ పేమెంట్ యాప్ తేజ్ గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ఫ్లాట్‌ఫారం ద్వారా ఇప్పటివరకు 75 కోట్ల ట్రాన్సక్షన్లు జరిగాయని, వీటి విలువ రూ. 2 లక్షల కోట్లని గూగుల్ ప్రకటించింది. తేజ్ యాప్‌ను ప్రతి నెలా 2.2 కోట్ల మంది వాడుతున్నారని త్వరలోనే గూగుల్ పే సేవలను ప్రపంచమంతా విస్తరిస్తామని తెలిపింది.

Read more about: app
English summary

ఇక పై గూగుల్ తేజ్ యాప్ పేరు "గూగుల్ పే" దీనితో లోన్ కూడా వస్తుంది. | Google Tez is Now Google Pay

Tej Google's iPhone based payments app online is a popular app for everyone transfers and it is easy to get extra money with reward vouchers.
Story first published: Wednesday, August 29, 2018, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X