లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్లలో అప్ ట్రెండ్‌ కొనసాగుతోంది. వడ్డీ రేట్లను అదే పనిగా పెంచమని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ చేసిన ప్రకటనతో నిన్నటి నుంచి స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిన్న యూరో మార్కెట్ల తరవాత అమెరికా మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ ఒక శాతంపైగా పెరగ్గా, నాస్‌ డాక్ కూడ ఇదే స్థాయిలో లాభపడింది. నిన్న ఏకంగా ఒకటి నుంచి రెండు శాతం దాకా పెరిగిన ఆసియా మార్కెట్లు ఉదయం నుంచి ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి. దాదాపు అన్ని ఆసియా సూచీలు గ్రీన్ లో ఉన్నాయి.

లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్
ఈ నేపథ్యంలో మన నిఫ్టి 11700 పైన ప్రారంభమైంది.క్రితం ముగింపుతో పోలిస్తే 54 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 11745 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలోని 50 షేర్లలో 41 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎన్ టీపీసీ మూడు శాతం లాభంతో టాప్ గెయినర్ గా నిలిచింది. గెయిల్ కూడా రెండు శాతంపైగా లాభపడింది. కోల్ ఇండియా, సిప్లా, వేదాంత కౌంటర్లు కూడా ఒకశాతంపైగా లాభపడ్డాయి. ఇక నష్టాలతో నడుస్తున్న నిఫ్టి షేర్లలో టైటాన్ ముందుంది. దీంతో ఎస్ బ్యాంక్, హిందుస్థాన్ లీవర్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్‌ షేర్లు ఉన్నా... నష్టాలన్నీ ఒకశాతం లోపు ఉన్నాయి. భారీ నష్టాలు ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్ స్థిరంగా క్రితం ముగింపు రూ. 283 వద్ద ట్రేడవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+