For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లాష్ ఫ్లాష్ SBI లో భారీ మార్పులు మీరే చూడండి.

By Sabari
|

ఎస్‌బీఐ శాఖ‌ల హేతుబ‌ద్దీక‌ర‌ణలో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ‌వ్యాప్తంగా ఒక్క‌సారిగా 1295 పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌ను మార్చేసింది. దీనికి సంబంధించిన నిర్ణ‌యాన్ని సోమ‌వారం ఎస్‌బీఐ వెబ్‌సైట్ ద్వారా ప్ర‌క‌టించింది.

ఎస్బీఐలో 6 అనుబంధ బ్యాంకులు, భార‌తీయ మ‌హిళా బ్యాంకు విలీనం త‌ర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో అతిపెద్ద బ్యాంకుగాను, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 53వ అతిపెద్ద బ్యాంకుగాను అవ‌త‌రించింది. జూన్ 30, 2018 నాటికి ఎస్‌బీఐ వ‌ద్ద 33.45 ల‌క్ష‌ల కోట్ల ఆస్తులున్నాయి.

ఫ్లాష్ ఫ్లాష్ SBI లో భారీ మార్పులు మీరే చూడండి.

1295 శాఖ‌ల పాత, కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్‌ని వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆస్తులు ఉన్న టాప్‌ బ్యాంకుల్లో ఎస్‌బీఐది 53వ స్థానం. 2018 జూన్ 30 నాటికి ఎస్‌బీఐ దగ్గర రూ.33.45 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. 22,428 బ్రాంచులతో భారతదేశంలో అతిబెద్ద బ్యాంకుగా అవతరించింది. అనుబంధ బ్యాంకుల్ని విలీనం చేయడం ద్వారా 1,805 బ్రాంచుల్ని తగ్గించుకోవడంతో పాటు 244 అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసుల్ని హేతుబ‌ద్దీకరించింది. ఎస్‌బీఐ పరిధిలోకి 71,000 కొత్త ఉద్యోగులు వచ్చారు.

బ్రాంచీల పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్‌తో వచ్చిన చెల్లింపులకు కూడా కొత్త కోడ్స్ వచ్చేలా మ్యాపింగ్ చేసి ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా చేశామని అధికారులు వివరించారు. పాత, కొత్త బ్రాంచీల ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్‌ను తమ బ్యాంకు వెబ్‌సైట్‌లోఉంచామని ఆయన చెప్పారు. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో బ్రాంచ్ లొకేటర్‌ను క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, సర్కిల్, బ్రాంచి పేరు సెర్చ్ చేసి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ పొందవచ్చని వివరించారు.

Read more about: sbi
English summary

ఫ్లాష్ ఫ్లాష్ SBI లో భారీ మార్పులు మీరే చూడండి. | SBI Changes 1300 IFSC Codes and Branches Names

As part of rationalization of SBI departments, Almost 1295 Old IFSC codes have been changed across the country. The decision was announced by the SBI website on Monday.
Story first published: Tuesday, August 28, 2018, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X