పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డుల వేటలో దూసుకెళ్లింది. కొనుగోళ్ల అండతో ఈ వారాన్ని సూచీలు భారీ లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా లాభంతో 10,700లకు చేరువలో స్థిరపడింది.
అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో పాటు బ్యాంకింగ్, లోహ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టగా.. నిఫ్టీ కూడా 11,600 మార్క్‌పైన సరికొత్త రికార్డులో ట్రేడ్ అయ్యింది. మార్కెట్ ఆద్యంతం మదుపర్లు కొనుగోళ్లు జరపడంతో సూచీలు వెనుదిరిగి చూడలేదు. భారీ లాభాల దిశగా పరుగులు తీశాయి. సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిలను తాకాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నేడు లాభాలను పొందాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 442 పాయింట్లు ఎగబాకి 38,694 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 11,692 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం కాస్త పతనమై రూ. 70.02గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో హిందాల్కో, ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టెక్‌మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడగా.. సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications