For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పక్క ప్లాన్ తో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు అమరావతి బాండ్స్ షురూ..

By Sabari
|

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని అమరావతి అవుతుందుని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

మాస్టర్ ప్లాన్

మాస్టర్ ప్లాన్

అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని ప్రకటించా. అందుకు సాయం చేయమని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరాం. డబ్బు తీసుకోకుండా వారు అమరావతి మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు.

 నెం1 స్థానంలో

నెం1 స్థానంలో

2029 కల్లా ఒక ట్రిలియల్ డాలర్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనేదే లక్ష్యం. ప్రస్తుతం ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఈగవర్నెన్స్ రంగాల్లో నెం1 స్థానంలో ఉంది. కొత్త ఎయిర్ పోర్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.

 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ఈగవర్నెన్స్, సాంకేతిక వినియోగంలో దాదాపు 500జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఏపీకి వచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్1 స్థానంలో ఉన్నాం. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లే ఐటీ నిపుణులు నలుగురిలో ఒకరు ఏపీ నుంచి ఉన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు భారత్‌కు చెందిన వారే. ఐటీ వల్లే హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీగా తయారయింది.

ప్రధానమంత్రిని ఒప్పించి

ప్రధానమంత్రిని ఒప్పించి

గతంలో కష్టాల్లో ఉన్న హైదరాబాద్‌ను అభివృద్ది చేశా. ప్రధానమంత్రిని ఒప్పించి ఓపెన్ స్కై పాలసీని తీసుకొచ్చాం. నీటి సమస్యను తీర్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ను అప్పడిగితే లీటర్‌కు రూ.20 ఛార్జీ చేస్తే ఇస్తామంది.

హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్‌ను

హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్‌ను

ప్రభుత్వ నిధులతోనే ఒక సంవత్సరంలో కృష్ణానది నుంచి 5టీఎంసీల నీటిని హైదరాబాద్ కు తెప్పించాం. ఏ ప్రాజెక్ట్ రావాలన్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. చాలా తక్కువ ఖర్చుతో హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్‌ను నిర్మించాం అని అన్నారు.

బీఎస్‌ఈ

బీఎస్‌ఈ

కాగా రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో సోమవారం లిస్టింగ్ చేశారు. ఈ ఉదయం 9.15 గంటలకు గంట కొట్టి బాండ్ల లిస్టింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.

లిస్టింగ్‌

లిస్టింగ్‌

కాగా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌పై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. అవే బీఎస్‌ఈలో సోమవారం లిస్టింగ్‌ అయ్యాయి.

Read more about: stock market
English summary

పక్క ప్లాన్ తో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు అమరావతి బాండ్స్ షురూ.. | Amaravathi Bonds Listing Today in BSE

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu said that Amravati is the best capital in the world and there is no doubt in it.
Story first published: Monday, August 27, 2018, 12:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X